Home > అంతర్జాతీయం > ఎన్నికల వేళ ఇమ్రాన్ ఖాన్కు షాకిచ్చిన కోర్టు..

ఎన్నికల వేళ ఇమ్రాన్ ఖాన్కు షాకిచ్చిన కోర్టు..

ఎన్నికల వేళ ఇమ్రాన్ ఖాన్కు షాకిచ్చిన కోర్టు..
X

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కోర్టు గట్టి షాకిచ్చింది. తోషాఖానా కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా లక్ష జరిమానాతో పాటు ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. కోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది క్షణాల్లోనే పోలీసులు ఇమ్రాన్ను అరెస్ట్ చేశారు. లాహోర్‌లోని తన నివాసంలో ఇమ్రాన్ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు తీర్పుతో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఇమ్రాన్ పోటీ చేసే అవకాశం లేకుండాపోయింది.

రాజకీయ ప్రముఖులు, అధికారులకు వచ్చే బహమతులను భద్రపరిచే శాఖను తోషాఖాన అంటారు. అయితే ఇమ్రాన్ ఖాన్ తనకు వచ్చిన బహుమతులను చట్టవిరుద్ధంగా అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఆయనపై క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఇమ్రాన్ అవినీతికి పాల్పడినట్లు రుజువైందంటూ దోషీగా తేల్చింది. పాకిస్థాన్ ఎన్నికల చట్టంలోని సెక్షన్ 174 ప్రకారం ఆయనకు మూడేళ్ల జైలు శిక్షతో విధిస్తున్నట్లు తెలిపారు.

అగస్ట్ 9న పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆ తర్వాత 90 రోజుల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఇమ్రాన్‌పై అనర్హత వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పోటీ చేస్తారని పీఎం షెహబాజ్‌ ఇప్పటికే ప్రకటించారు.

Updated : 5 Aug 2023 2:36 PM IST
Tags:    
Next Story
Share it
Top