పాకిస్థాన్ స్టార్ ఆటగాడు రిటైర్మెంట్
X
ఇటీవల వివిధ దేశాలకు చెందిన స్టార్ ప్లేయర్స్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా పాకిస్థాన్ నుంచి ఒక వికెట్ పడింది. ఆ దేశ స్టార్ బౌలర్ వహాబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత రెండేళ్లు క్రికెట్ ఆడని రియాజ్ ఇప్పుడు ఆటకు దూరమవుతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
'అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. అద్భుతమైన ప్రయాణాన్ని ముగిస్తున్నాను. అంతర్జాతీయ క్రికెటర్‌గా నా ఎదుగుదలకు కృషి చేసిన పీసీబీ, నా కుటుంబం, కోచ్‌లు, మెంటార్స్, సహచర ఆటగాళ్లు.. నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నా.నేను గత రెండేళ్లుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. నా దేశం తరఫున శక్తివంచన లేకుండా ఆడా. ఫ్రాంచైజీ క్రికెట్‌లోనా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు థ్రిల్‌గా ఉన్నాను " అని రియాజ్ రాసుకొచ్చాడు.
38 ఏళ్ళ మహ్మద్ రియాజ్ తన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను చివరిసారిగా 2020లో ఆడాడు. మొహాలీ వేదికగా 2011 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత్‌పై రియాజ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.అయతే ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి చవిచూసింది. 2010 ఆగస్టులో ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ ఆరంగ్రేటం చేసిన రియాజ్.. పాకిస్థాన్ తరఫున 2011, 2015, 2019 వన్డే ప్రపంచకప్ ఆడాడు. రియాజ్ దేశం తరఫున మొత్తం 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 83 వికెట్లు, వన్డేల్లో 120, టీ20ల్లో 34 వికెట్లను రియాజ్ సాధించాడు.