Home > అంతర్జాతీయం > రాజకీయ పార్టీ ర్యాలీలో పేలుడు.. 40 మంది మృతి

రాజకీయ పార్టీ ర్యాలీలో పేలుడు.. 40 మంది మృతి

రాజకీయ పార్టీ ర్యాలీలో పేలుడు.. 40 మంది మృతి
X

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రాంతంలోని బజౌర్ లో అఘాయిత్యానికి పాల్పడ్డారు. జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) కార్మికుల సదస్సును లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు భారీ పేలుడుకు పాల్పడ్డారు. ఆ పార్టీ ర్యాలీలో బాంబు పేల్చగా దాదాపు 40 మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. 150 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఐదు అంబులెన్స్ అను ఏర్పాటు చేసి క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. అయితే, ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ప్రశాతం వాతావరణంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగే సరికి.. ఆ ప్రాతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. అయితే, పేలుడు ఎలా జరిగింది అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ఓ పార్టీ నేతను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతుంది. అయితే, ఆ నేత ప్రసంగానికి ముందే బాంబు పేలింది.



Updated : 30 July 2023 10:35 PM IST
Tags:    
Next Story
Share it
Top