Home > అంతర్జాతీయం > జపాన్లో ఢీకొన్న రెండు విమానాలు.. క్షణాల్లోనే చుట్టేసిన మంటలు

జపాన్లో ఢీకొన్న రెండు విమానాలు.. క్షణాల్లోనే చుట్టేసిన మంటలు

జపాన్లో ఢీకొన్న రెండు విమానాలు.. క్షణాల్లోనే చుట్టేసిన మంటలు
X

జపాన్లో పెను ప్రమాదం తప్పింది. జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ A350 విమానం ప్రమాదానికి గురైంది. దేశ రాజధాని టోక్యోలోని హనేడా (టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. విమానం రన్ వేపై దిగుతుండగా ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న కోస్ట్ గార్డు ఎయిర్ క్రాఫ్టును ఢీకొంది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే విమానం మంటల్లో చిక్కుకుపోయింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్లో సిబ్బంది, ప్రయాణికులతో కలిపి 400 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంటల కారణంగా ఎంత మందికి గాయాలైన విషయం ఇంకా తెలియలేదు. మంటలు ఎగిసిపడుతుండటంతో వాటిని అదుపు చేయడం కష్టంగా మారింది.

మరోవైపు కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ఆరుగురిలో ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రమాద ఘటనపై జపాన్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు వివిధ శాఖల మధ్య అనుసంధానం కోసం ఎమర్జెన్సీ రూం ఏర్పాటు చేశారు.

Updated : 2 Jan 2024 10:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top