Home > అంతర్జాతీయం > Pawan Kalyan : తెలంగాణ భూములను వైఎస్సార్ ఫ్యామిలీ దోచుకుంది

Pawan Kalyan : తెలంగాణ భూములను వైఎస్సార్ ఫ్యామిలీ దోచుకుంది

Pawan Kalyan : తెలంగాణ భూములను వైఎస్సార్ ఫ్యామిలీ దోచుకుంది
X

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రుషికొండ పర్యటన అనంతరం మాట్లాడిన పవన్.. రుషికొండకు బోడిగుండు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రుషి కొండ లాంటి ప్రకృతి వనరును వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక్క రాజధానే దిక్కులేదు.. మళ్లీ మూడు రాజధానులు కడతారట అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సర్క్యూట్ హౌన్ ను తాకట్టు పెట్టడం సీఎం చేయాల్సిన పని కాదని, చట్టాలను కాపాడాల్సి వాళ్లే క్రిమినల్ లా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రపై జగన్ కన్ను పడింది. లూటీ చేసే వరకు వదిలిపెట్టడని ఆరోపించారు.

రిషికొండలో నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్ ట్రిబ్యూల్ అనుమతులు లేవని అన్నారు. తెలంగాణ పర్యావరణాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాశనం చేసినట్లు, అక్కడి వనరులను దోచుకున్నట్లు జగన్ ఆంధ్రపై పడ్డాడని తెలిపారు. ఆంధ్రలో కూడా అక్రమంగా దోచుకుంటున్నాడని ఆరోపించారు. జగన్ ఫ్యామిలీ అక్రమాల గురించి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసని, అందుకే వరంగల్ రైల్వే స్టేషన్ లో అడుగు పెట్టకుండా జగన్ ను రాళ్లతో తన్ని తరిమేశారని అన్నారు.


Updated : 18 Aug 2023 5:34 PM IST
Tags:    
Next Story
Share it
Top