10 రోజుల్లో పెళ్లి.. పెంపుడు కుక్క చేసిన పనికి వరుడు షాక్
X
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. అలాంటి ఘట్టాన్ని గుర్తుండిపోయేలా మలుచుకోవాలని అందరూ భావిస్తారు. అందుకే కొందరు ఖర్చెంతైనా పర్లేదని డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటారు. అమెరికాకు చెందిన ఓ జంట కూడా తమ పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలని డిసైడైంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే పెళ్లికి 15 రోజుల ముందు వరుడి పెంపుడు కుక్క చేసిన పని వాళ్లను ప్రాబ్లెంలో పడేసింది.
షాకిచ్చిన పెంపుడు కుక్క
అమెరికాకు చెందిన డొనాటో ఫ్రాట్టరోలి, మగ్దా మజ్రీకి ఇటీవలే పెళ్లి కుదిరింది. ఆగస్టు 31న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. శుక్రవారం పెళ్లి బృందం ఇటలీ బయలుదేరేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. గురువారం డొనాటో, మగ్దాలు పెళ్లికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు సిటీ హాల్కు వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చిన వారికి డొనాటో పెంపుడు కుక్క చిక్కీ షాకిచ్చింది.
పాస్పోర్ట్ను నమిలేసి
ఇంటికి చేరుకున్న పెళ్లి కొడుకు డొనాటో ఫ్రాట్టరోలీకి చిక్కీ తన పాస్పోర్ట్ నములుతూ కనిపించంది. వెంటనే ఆ పాస్ట్ పోర్ట్ ను లాక్కొని చూడగా కుక్క అప్పటికే సగం పేజీను పరపరా నమిలేసింది. ఇటలీ బయలుదేరేందుకు వారం రోజుల ముందు పెంపుడు కుక్క చేసిన పనికి డొనాటో తలపట్టుకున్నాడు. బంధువులు, స్నేహితులు ఇచ్చిన సలహాతో స్థానిక అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతని బాధ అర్థం చేసుకున్న అధికారులు వీలైనంత తొందరగా కొత్త పాస్ పోర్ట్ జారీ చేసే ప్రయత్నం చేస్తామని భరోసా ఇవ్వడంతో డొనాటో ఊపిరిపీల్చుకున్నాడు. పెళ్లి బృందం శుక్రవారం ఇటలీకి బయలుదేరనుంది. ఆ లోపు కొత్త పాస్ పోర్ట్ వస్తే వారితో కలిసి ఫ్లైట్ ఎక్కుతానని, లేనిపక్షంలో ఇటలీ నుంచి తిరిగొచ్చిన వారికి స్వాగతం చెప్పేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్తానని పెళ్లికొడుకు అంటున్నాడు..