షాకింగ్ న్యూస్..రూ.300 దాటిన లీటర్ పెట్రోల్ ధర
X
దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో నిత్యావసర ధరలతో పాటు ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో పాక్ ప్రజలు తల్లడిల్లుతున్నారు. తాజాగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 మార్కును దాటేశాయి. దీంతో ప్రజలు మరింత ఇబ్బందిపడుతున్నారు.
ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు పాక్ ప్రజలు. ఇది చాలదన్నట్లు తాజాగా చమురు ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకడంతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 దాటింది. దీంతో సామాన్యులు పెట్రోల్ కొనుగోలు చేయాలేని దయనీయ పరిస్థితి నెలకొంది. పాక్ దేశ చరిత్రలో ఇంతటి స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.
పాక్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరను రూ.14.91 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలతో లీటర్ పెట్రోల్ ధర రూ.305.36 కు చేరింది. అదే విధంగా డీజిల్ ధర రూ.311.84 కు చేరుకుంది. ఇదిలా ఉంటే డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారకం విలువ కూడా భారీగా పతనం కావడంతో పాకిస్థాన్ రూపాయి విలువ రూ.305.6 గా ఉంది. రూపాయి విలువ భారీగా పతనం కావడంతో పాక్ సెంట్రల్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లను అధికం చేసింది. ఈ నిర్ణయం పాక్ ప్రజలను మరింతగా కుంగదీస్తోంది.
పెరిగిన ధరలపై ప్రస్తుతం పాక్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విద్యుత్ ఛార్జీల ధరల పెంపుపై ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసనలో భాగంగా భారీగా వచ్చిన కరెంటు బిల్లులను ప్రజలు కాల్చేశారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులతోనూ తీవ్ర ఘర్షణకు దిగారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాట్లు తాజాగా పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయక పోవడంతో ప్రజల్లో సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి నెలకొం