Home > అంతర్జాతీయం > రూ. 136 కోట్ల చారిత్రక బంగ్లాను కూల్చేస్తున్నారు..ఎందుకంటే?

రూ. 136 కోట్ల చారిత్రక బంగ్లాను కూల్చేస్తున్నారు..ఎందుకంటే?

రూ. 136 కోట్ల చారిత్రక బంగ్లాను కూల్చేస్తున్నారు..ఎందుకంటే?
X

అమెరికాలో ఒకప్పటి టెలివిజన్‌ టాక్‌ షో సృష్టికర్త, ప్రొడ్యూజర్ ఫిల్‌ డోనాహ్యూ బంగ్లా త్వరలో నేలమట్టం కానుంది. అవును మీరు విన్నది నిజమే. ఈ విషయం ప్రస్తుతం స్థానికంగా ఉన్నవారిని తీవ్రంగా కలచివేస్తోంది. సముద్ర తీరాణ, ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందరినీ కట్టిపడేసిన ఇంద్ర భవనం లాంటి ఈ విలాసవంతమైన రాజ బంగ్లాను ఒక చిన్న కారణంతో ధ్వంసం చేయాలని డిసైడ్ అయ్యారు యజమానులు. ఒకప్పుడు దాదాపు 200 కోట్లకు విక్రయించిన రాజ బంగ్లాను నిర్ధాక్షణ్యంగా కూల్చేందుకు సిద్ధమయ్యారు. అసలు ఎందుకు ఈ బంగ్లాను కూల్చాలనుకుంటారో తెలుసుకుంటే అందరూ షాక్ అవుతారు. సాదారణంగా ఇంట్లో ఎలుకలు దూరితే ఎవరైనా ఏం చేస్తారు ..వాటిని పట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంతే కాని ఎలుకలు ఉన్నాయని ఇంటిని కూల్చుకోము కదా. కనీ అదే జరుగుతోంది ఇప్పుడు అమెరికాలో ఈ భారీ భవనం కేవలం ఎలుకల కారణంగా నేలమట్టడం కాబోతోంది.



వెస్ట్‌పోర్ట్‌లో హాలీవుడ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాజభవంతిలా ఉట్టిపడేలా గోల్డ్‌ కోస్ట్‌ బంగ్లాను డొనహ్యు నిర్మించారు. 80వ దశకంలో టాక్ షో రూపకర్త డోనాహ్యు, ఆయన భార్య మార్లో థామస్ సమ్మర్ సీజన్ వచ్చిందటే చాలు ఈ బంగ్లాలో సేద తీరేవారు. వీరితో పాటే అప్పట్లో వెస్ట్‎పోర్ట్ నివాసితులు, సెలబ్రిటీలు, స్టార్స్ ఎందరో ఈ బంగ్లాలో సేదతీరేవారు. 2006లో డొనహ్యు ఈ భవంతి పక్కనే మరో విలాసవంతమైన మల్టీ మిలియన్ డాలర్ గోల్డ్ కోస్ట్‎ని కొనుగోలు చేశారు. అనంతరం పాత బంగ్లాను అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా దగ్గర అసిస్టెంట్ ట్రెజరీ కార్యదర్శిగా పని చేసిన అల్లిసన్‎కు విక్రయించారు. అప్పట్లో 200 కోట్లకు భవంతిని విక్రయించి టాక్ ఆఫ్ ది టౌన్‏గా నిలిచారు డొనహ్యు . అప్పట్లో ఒబామా కూడా ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారట.

2013లో అల్లిసన్‌ చనిపోయిన తరువాత తర్వాత బంగ్లాను పర్యవేక్షించేవారు కరువయ్యారు. అనంతరం రైనర్ దంపతులు 2020లో రూ. 136 కోట్లకు ఈ భవనాన్ని కొన్నారు. అప్పటికే భవనం పరిస్థితి అధ్వానంగా మారింది. రాత్రిళ్లు ఈ భవనం ఎలుకలకు స్థావరంగా మారింది. ఎలుకలను తరిమేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోండంతో రైనర్ దంపతులు ఈ చారిత్రక కట్టడాన్ని కూల్చేయాలని నిర్ణయించుకున్నారు. భవనం కూల్చివేతకు అనుమతి ఇవ్వాలని హిస్టారిక్ కమిషన్‎కి దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే ఈ కట్టడం కూల్చివేతకు 180 రోజులు నిరీక్షించాల్సి ఉంటుందని రైనర్ దంపతులకు కోర్టు తెలిపింది. ఈ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉంటే చూడాలని సూచించింది. ఈ చారిత్రక కళాఖండంలోని రాతి స్తంభాలను పరిరక్షించాలని కమిషన్ భావిస్తోంది. ఏదేమైన ఎలుకలు చేసిన పనికి ఇంతటి చారిత్రక కట్టడం నేలమట్టం అవ్వడం అక్కడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Phil Donahue’s Former Gold Coast Mansion To Be Demolished. You will be surprised to hear what is the main reason.

Phil Donahue, Former Gold Coast Mansion, Demolished.rats, obama, america ex president,america, rainer, allison,

historic place, construction,

Updated : 10 Jun 2023 5:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top