Home > అంతర్జాతీయం > మోడీ తొలి ప్రెస్ మీట్.. జర్నలిస్టుల ప్రశ్నలకు జవాబివ్వనున్న ప్రధాని

మోడీ తొలి ప్రెస్ మీట్.. జర్నలిస్టుల ప్రశ్నలకు జవాబివ్వనున్న ప్రధాని

మోడీ తొలి ప్రెస్ మీట్.. జర్నలిస్టుల ప్రశ్నలకు జవాబివ్వనున్న ప్రధాని
X

ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి మీడియా ప్రశ్నకు బదులివ్వనున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి గురువారం మీడియా ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా యూఎస్ మీడియా నుండి ఒక ప్రశ్న, భారత్ మీడియా నుండి ఒక ప్రశ్నకు మోడీ బదులివ్వనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు ధృవీకరించారు.

మోడీ, బైడెన్ ప్రెస్ మీట్ను చాలా పెద్ద విషయమని వైట్ హౌస్ అభివర్ణించింది. నిజానికి మోడీ 2014లో ప్రధాని అయిన తర్వాత భారతదేశంలో ఒక్క విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడలేదు. 2019 మేలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైనా జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించలేదు. విదేశీ పర్యటనలలో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప సాధారణంగా జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వరన్న విమర్శలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే మోడీ, బిడెన్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించిన వైట్ హౌస్ ప్రతిపాదనపై భారత అధికారులు మొదట అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రధాని మోడీది కేవలం వన్ వే కమ్యూనికేషన్ అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన మనసులో ఏముందో మన్ కీ బాత్ ద్వారా మాట్లాడుతారే తప్పా ప్రజల మనసులో ఉన్న విషయమేంటో వినరని ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. ఈక్రమంలో అమెరికా పర్యటనలో మీడియా సంధించే ప్రశ్నలకు మోడీ ఎలాంటి సమాధానాలు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Updated : 22 Jun 2023 11:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top