Home > అంతర్జాతీయం > భారత వ్యాపారి వల్లే ప్రధాని అయ్యా : నేపాల్ పీఎం

భారత వ్యాపారి వల్లే ప్రధాని అయ్యా : నేపాల్ పీఎం

భారత వ్యాపారి వల్లే ప్రధాని అయ్యా : నేపాల్ పీఎం
X

నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ చిక్కుల్లో పడ్డారు. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనను చిక్కల్లోకి నెట్టాయి. తనను ప్రధాని చేయడానికి ఓ భారత వ్యాపారి తీవ్రంగా కృషి చేశారని ఆయన చెప్పడం ఆ దేశంలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన రాజీనాయా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

నేపాల్‌లో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్త సర్దార్ ప్రీతమ్ సింగ్‌ జీవితకథపై రాసిన ‘రోడ్స్ టు ద వ్యాలీ: ద లెగసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని ప్రచండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను ప్రధాని కావడానికి సర్దార్ ప్రీతమ్ సింగ్ కారణమని చెప్పారు. తనను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి సర్దార్ ప్రీతమ్ సింగ్ అటు ఢిల్లీలో ఇటు ఖాట్మాండులోని రాజకీయ వర్గాలతో చర్చలు జరిపారని అన్నారు.

తాను ప్రధాని కావడం వెనుక సర్దార్ ప్రీతమ్ సింగ్ కృషి చాలా ఉందని ప్రచండ కొనియాడారు. నేపాల్-భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన తన వంతు సహకారం అందించారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నేపాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. నేపాల్ ప్రధానిని ఢిల్లీ నియమించినట్లుగా తెలుస్తోందని.. వెంటనే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

సర్ధార్ ప్రతీమ్ సింగ్ 1960లో భారత్ నుంచి నేపాల్‌కు వెళ్లాడు. అక్కడ ట్రాన్స్పోర్ట్ కింగ్‌గా అవతరించారు. స్థానికంగా ఉన్న సంస్థలను వెనక్కినెట్టి తన సంస్థను నెంబర్ వన్గా నిలిపారు.

Updated : 6 July 2023 7:42 PM IST
Tags:    
Next Story
Share it
Top