Home > అంతర్జాతీయం > భయంకరం.. 45బ్యాగుల్లో మనుషుల శరీర భాగాలు

భయంకరం.. 45బ్యాగుల్లో మనుషుల శరీర భాగాలు

భయంకరం.. 45బ్యాగుల్లో మనుషుల శరీర భాగాలు
X

అది మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రం. అక్కడి ఇండస్ట్రీయల్ పార్క్ సమీపంలోని ఓ లోయలో 45 సంచులు కన్పించాయి. అందరు వాటిని చెత్త సంచులు అని అనుకున్నారు. కానీ పోలీసులు వచ్చి విప్పి చూస్తే కానీ తెలియలేదు.. అందులోని భయంకరమైన వాస్తవం.. ఆ 45 సంచుల్లో మనుషుల శరీర భాగాలు ఉన్నాయి. స్త్రీ, పురుష శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో ఈ దారుణం వెలుగుచూసింది. మే 20న దాదాపు 30 ఏళ్ల వయసు ఉన్న ఏడుగురు యువతీయువకులు కనిపించకుండా పోయారు. వారి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వారంతా ఒకే కాల్‌ సెంటర్‌లో పనిచేస్తుండగా.. వారి మిస్సింగ్ కేసులు మాత్రం వేర్వేరు రోజుల్లో నమోదయ్యాయి.

మరోపక్క.. వారు పనిచేస్తోన్న కాల్‌ సెంటర్‌కు సమీపంలోనే ఈ 45 బ్యాగులు దొరికాయని అధికారులు తెలిపారు. అయితే ఆ శరీర భాగాలు ఎంత మందివి.. ఎవరివీ అన్న విషయాలను ఫోరెన్సిక్ నిపుణులు తేల్చాల్సివుంది. ప్రస్తుతం ఆ కాల్‌ సెంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్, రక్తపు మరకలతో ఉన్న వస్తువులు, కొన్ని సర్టిఫికెట్లను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆ శరీరభాగాలు ఎవరివనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

జాలిస్కో రాష్ట్రంలో గతంలోనూ బ్యాగుల్లో మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. 2021లో టోనాలా ప్రాంతంలో 70 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు బయటపడగా.. 2019 లో 119 బ్యాగులు లభ్యమయ్యాయి. దీంతో వీటి వెనుక ఏదో పెద్ద ముఠానే ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నారు.

Updated : 2 Jun 2023 3:53 PM IST
Tags:    
Next Story
Share it
Top