అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి.. లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..
X
అతడు 27 ఏండ్ల కుర్రాడు.. ఆమె వయసు 45. భర్తతో విడాకులు తీసుకుని ఐదేండ్ల పాపతో పోలాండ్లో ఉంటోంది. ఓ రోజు ఇన్ స్టాగ్రాం చూస్తుండగా ఓ ప్రొఫైల్ ఆకట్టుకుంది. జార్ఖండ్ కు చెందిన యువకుడితో అలా మొదలైన పరిచయం ముందు స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. ఎట్టకేలకు ప్రియుడిని కలుసుకునేందుకు అతని సొంతూరు వచ్చింది.
జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలోని కటకంసంది మండలం ఖుత్రా గ్రామానికి చెందిన షాబాద్ మాలిక్‌కు పోలాండ్ కు చెందిన బార్బరాతో ఇన్ స్టాగ్రాంలో పరిచయం అయింది. ఆమె భర్తతో విడాకులు తీసుకుని ఐదేళ్ల కూతురుతో కలిసి ఉంటోంది. అక్కడే సొంతంగా ఓ కంపెనీ నడుపుతోంది. ఇన్స్టాలో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు ఇండియాకు వచ్చిన బార్బరా ముంబైలో షాబాద్ ను కలుసుకుంది. తాజాగా షాబాద్‌ను కలిసేందుకు ఖుత్రా గ్రామానికి వచ్చింది.
ఖుత్రా గ్రామానికి చేరుకున్న బార్బరా ప్రస్తుతం షాబాద్ ఇంట్లోనే ఉంటోంది. ఇంట్లో ఏసీ పెట్టించడంతో పాటు మరికొన్ని వస్తువులు కొనుగోలు చేసింది. ఆమె కూతురు అనియా షాబాద్ ను డాడీ అని పిలుస్తుండటం విశేషం. పోలాండ్ మహిళ గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు ఖుత్రాకు చేరుకున్నారు. ఆమె వీసాను పరిశీలించారు. 2027 వరకు టూరిస్ట్ వీసా గడువు ఉండటంతో వెనుదిరిగారు. బార్బరా, షాబాద్ త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం హజారీబాగ్ ఎస్డీఎం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లైన వెంటనే షాబాద్‌ను బార్బరా తనతో పాటే పోలాండ్‌కు తీసుకెళ్లనుంది.