India-Maldives row:మాల్దీవ్స్ టూర్కు రండి.. చైనా ప్రజలను కోరిన మహమ్మద్ ముయిజ్జు
X
మాల్దీవ్స్- భారత్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీనంతటికి కారణం.. ఇంతకాలం భారత్ తో స్నేహం చేసిన మాల్దీవ్స్.. చైనాతో రహస్యంగా చేయి కలపడమే. అంతేకాకుండా భారత్ కు వ్యతిరేకంగా అక్కడి మంత్రులు అక్కసు వెల్లగక్కారు. భారత్ పై ట్విట్టర్ ద్వారా తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అవికాస్త వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలో వారిని మాల్దీవ్స్ ప్రభుత్వం హెచ్చరించి పదవుల నుంచి తొలగించింది. తమ ప్రభుత్వానికి, మంత్రుల వ్యాఖ్యలకు ఏం సంబంధం లేదని తెలిపింది. అయితే మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్త 90శాతం టూరిజంపై ఆధారపడి ఉంటుంది. దీంతో చాలామంది భారతీయులు తమ మాల్దీవ్స్ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. హోటల్స్, ఫ్లైట్ బుక్కింగ్స్ రద్దుచేసుకున్నారు. దీంతో వారి ఆర్థిక వ్యవస్తపై భారీగా దెబ్బ పడింది. ఈ క్రమంలో ఇవాళ మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు సతీసమేతంగా చైనా పర్యటనకు వెళ్లారు.
భారత్ నుంచి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఎక్కువ మంది చైనా పర్యటకులను మాల్దీవ్స్ కు పంపాలని చైనా అధ్యక్షుడిని కోరారు. ఫుజియాన్ ప్రావిన్స్‌లో మాల్దీవుల బిజినెస్ ఫోరమ్‌లో ప్రసంగించిన ముయిజ్జు.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మా సన్నిహిత మిత్ర దేశాల్లో చైనా ఒకటి. మా టూరిజాన్ని డెవలప్ చేసి, ఆర్థికంగా మా ఎదుగుదలకు తోర్పడేందుకు మాల్దీవ్స్ కు రండి’ అని ప్రసంగించారు. ఈ పర్యటనలో భాగంగా.. హిందూ మహాసముద్రంలో ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్ ను అభివృద్ధి చేసేందుకు.. రెండు దేశాలు 50 మిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్ట్ పై సంతకం చేశాయి. కాగా ముయిజ్జు చర్యలు దేనికి దారితీస్తాయో తెలియాల్సి ఉంది.