భారత్ పర్యటన విశేషాలు పంచుకున్న ఫాన్స్ అధ్యక్షుడు
X
భారత రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా హాజరైన ఫాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తన పర్యటన విశేషాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన గ్లింబ్స్ వీడియోను మేక్రాన్ పోస్టు చేశారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు పారిస్ తహతహలాడుతోందని అన్నారు.పరివర్తన దిశగా అడుగులేస్తున్న ప్రపంచదేశాల్లో భారత్ ముందువరుసలో ఉందని కితాబిచ్చారు. ఈ పర్యటనతో ‘టీ’ ఓ అలవాటుగా మారిపోయిందని సరదాగా వ్యాఖ్యానించారు. భారత్ 75వ గణతంత్రవేడుకలకు తనను ఆహ్వానించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు మేక్రాన్ పేర్కొన్నారు. కవాతులో ఫ్రాన్స్ కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుంటే.. పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందేందుకు వీలుంటుందని చెప్పారు. 2030 నాటికి భారత్ నుంచి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించేందుకు ఫ్రాన్స్ సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.ప్రతి ఏడాది మనదేశంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు.. ఇతర దేశాల ప్రెసిడెంట్ లు, దేశాధినేతలను అతిథులుగా పిలవడం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం 75 వ రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మన దేశానికి వచ్చారు.