ఒడ్డుకు చేరుకున్న టైటాన్ శకలాల్లో వారి శరీర భాగాలు!!
X
అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ని చూసొద్దామని.. టైటాన్ అనే సబ్‌మెరైన్ ద్వారా వెళ్లిన అయిదుగురు బృందం మరణించిన సంగతి తెలిసిందే. సముద్ర అడుగు భాగానికి వెళ్లే క్రమంలో ఆ సబ్ మెరైన్.. ప్రెషర్ కారణంగా పేలిపోవడడంతో అంతా ప్రాణాలు విడిచారు. ఇప్పుడు ఆ సబ్ మెరైన్ శకలాలు తీరానికి చేరాయి. ఈ క్రమంలో అందులో మానవ అవశేషాలుగా అనుమానిస్తున్న భాగాలను నిపుణులు సేకరించారు. ఈ అవశేషాలను అమెరికాకు చెందిన వైద్య నిపుణులు విశ్లేషించనున్నారని యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది.
కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్సులో సెయింట్ జాన్స్ ఓడరేవుకు ఆ శకలాలను తీసుకొచ్చినట్టు అమెరికా కోస్ట్‌గార్డ్ దళాలు వెల్లడించాయి. ఈ ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకునేందుకు జరుగుతున్న దర్యాప్తులో ఇది కీలక పరిణామమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ నౌకను చూసేందుకు ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్‌కు చెందిన 77 ఏళ్ల హెన్రీ నార్గొలెట్ ఇందులో వెళ్లారు. ప్రమాదంలో ఈ అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు.