Home > అంతర్జాతీయం > Putin on India: భారత్ సహా అన్ని దేశాలు ప్రమాదంలో ఉన్నాయి: పుతిన్‌

Putin on India: భారత్ సహా అన్ని దేశాలు ప్రమాదంలో ఉన్నాయి: పుతిన్‌

Putin on India: భారత్ సహా అన్ని దేశాలు ప్రమాదంలో ఉన్నాయి: పుతిన్‌
X

భారత్‌ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం తో పాటు.. సౌతాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సు కు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకాని విషయం తెలిసిందే. దీనిపై పుతిన్ తాజాగా స్పందించారు. సోచి నగరంలోని రష్యన్‌ బ్లాక్‌ సీ రిసార్ట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘అమెరికా, యూరప్ లాంటి పశ్చిమ దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దాన్ని అంగీకరించని ప్రతీ దేశాన్ని శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ సహా అన్ని దేశాలు ఈ ప్రమాదంలోనే ఉన్నాయి. కానీ భారత స్వతంత్ర దేశం. అక్కడి ప్రభుత్వం తమ దేశ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా పనిచేస్తుంది. దానివల్ల రష్యా నుంచి భారత్ ను దూరం చేసే ప్రయత్నం అర్థం లేని చర్యే’అని పుతిన్ విమర్శలు గుప్పించారు.

తన వల్ల బ్రిక్స్‌ సదస్సు, జీ 20 సదస్సు పొలిటికల్ షో గా మారకూడదనే ఆ సమావేశాలకు హాజరు కాలేదని పుతిన్ చెప్పుకొచ్చారు. ‘సదస్సుల వేళ నా స్నేహితులకు ఎందుకు సమస్యలు సృషించాలి?’ అని అన్నారు. అందువల్లే ఏ సమావేశాలకు తాను హాజరు కాలేదని స్పష్టం చేశారు. ఈ సంద్భంగా ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలంగా అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. ఇక ఉక్రెయిన్ పై సైనిక చర్యకు పాల్పడినందుకు పుతిన్ పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల్లో పుతిన్ పర్యటిస్తే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే పుతిన్ రష్యా వదిలి ఏ దేశానికి వెళ్లట్లేదు.

Updated : 6 Oct 2023 1:13 PM IST
Tags:    
Next Story
Share it
Top