Dumbo Octopus : సముద్రం లోతుల్లో ఏనుగు చెవుల జీవి.. వీడియో వైరల్
X
విచిత్రమైన ఎన్నో జీవరాశులకు సముద్రం నిలయం. సముద్ర గర్భంలో మనిషి కనుగొనని ఎన్నో జీవరాశులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇప్పటికే ఎన్నో వింతలు, విశేషాలను సముద్రం చాలాసార్లు పరిచయం చేసింది. తాజాగా పసిఫిక్ సముద్రం లోతుల్లో ఓ వింత జీవి కన్పించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
నార్త్ పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత అరుదైన డంబో ఆక్టోపస్ కనిపించింది. రిమోట్‌తో పనిచేసే ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ వాహనంలోని డీప్ సీ కెమెరా ఈ ఆక్టోప్ వీడియో తీసింది. ఈ అరుదైన ఆక్టోపస్ దాదాపు 7 కిలోమీటర్ల లోతులో నివసిస్తోంది. ఈ ఆక్టోపస్ డంబో ది ఎలిఫింట్ చెవుల వలె భారీ రెక్కలను కలిగివుంది. అందుకే వీటిని డంబో ఆక్టోపస్గా పిలుస్తారట.
ప్రపచంలోనే వీటిని అందమైన ఆక్టోపస్‌లు అంటారు. ప్రత్యేకమైన చెవిలాంటి రెక్కలతో ఇది కదులుతుందట. అందుకు సంబంధించిన వీడియోని ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.