Home > అంతర్జాతీయం > భూమిపైకి అరుదైన జిరాఫీ...ఇలా జరగడం ఇదే తొలిసారి

భూమిపైకి అరుదైన జిరాఫీ...ఇలా జరగడం ఇదే తొలిసారి

భూమిపైకి అరుదైన జిరాఫీ...ఇలా జరగడం ఇదే తొలిసారి
X

చూడడానికి ఆసక్తికరంగా అనిపించే జంతువుల్లో జిరాఫీ ఒకటి. పొడవాటి మెడ, కాళ్లును కలిగి ఉంటాయి. బఫ్, ఎర్రటి గోధుమ రంగు మచ్చలతో ఉంటుంది. చూడగానే జిరాఫీని గుర్తుపట్టేయొచ్చు. భూమి మీద నివసించే జిరాఫీలన్నీ ఈ లక్షణాలతోనే కనిపిస్తాయి. కానీ తాజాగా ప్రపంచలో కొత్తరకం జిరాఫీ జన్మించింది. మచ్చలేని జిరాఫీ అమెరికాలోని టెన్నెస్సీలో ఉన్న జూలో పుట్టింది.

మచ్చల్లేకుండా ఓ జిరాఫీ జన్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. శరీరమంతా మొత్తం బ్రౌన్ కలర్‌లో ఉన్న ఈ ఆడ జిరాఫీకి ఒంటిపై ఒక్క మచ్చ కూడా లేదు. దాని శరీరం నున్నగా మెరుస్తూ కనిపించడం అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ జిరాఫీ ఎత్తు ఆరు అడుగులు. జులై 31న జన్మించిన ఈ జిరాఫీ తల్లి సంరక్షణలో పెరుగుతోంది. దీనికి ఇంకా పేరుపెట్టలేదని ఆధికారులు వెల్లడించారు.

ఈ అరుదైన జిరాఫీ అంతరించిపోతున్న జాతికి చెందిన రెటిక్యులేటెడ్ జిరాఫీ అని పలు నివేదికలు చెబుతున్నాయి. , జిరాఫీలు వేగంగా అంతరించిపోతున్నాయని, గత మూడు దశాబ్దాలలో 40 శాతం జిరాఫీలు మాయమయ్యాయని బ్రైట్స్ జూ వ్యవస్థాపకుడు టోనీ బ్రైట్ తెలిపారు. జిరాఫీ అన్ని క్షీరదాలలోకెల్లా ఎత్తైనది. ఇది 18 అడుగులు, అంతకంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.



Updated : 22 Aug 2023 6:03 PM IST
Tags:    
Next Story
Share it
Top