అపార్ట్మెంట్ కాదిది.. 20 వేలమంది ఉంటున్న మినీ నగరం
X
చాలామంది సిటీ కల్చర్ కు అలవాటు పడిపోయారు. నగరాలకు వలస వెళ్లి అపార్ట్మెంటుల్లో జీవిస్తున్నారు. కాస్త ఎక్కువ ఖర్చైనా సరే.. మంచి వ్యూ, ఆహ్లాదరకమైన వాతావరణం, మంచి కమ్యూనిటీ, అన్ని వసతులు కలిగి ఉన్న అపార్ట్మెంటుల్లో ఫ్లాట్ కొనడానికి ఇష్టపడుతున్నారు. అపార్ట్మెంట్ అంటే మహా అయితే 15 నుంచి 30 అంతస్తులు ఉంటుంది మనదగ్గర. అందులో 150 మంది నివసిస్తే ఎక్కవ. కానీ ఇక్కడ అలా కాదు. ఈ అపార్ట్ మెంట్ లో ఏకంగా.. 20 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. అపార్ట్ మెంట్ లా కాకుండా మినీ నగరంగా కనిపిస్తున్న ఈ భవనం ఉన్నది చైనాలో. ప్రస్తుతం ఈ అపార్ట్ మెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చైనాలోని హంజ్ జౌలో ఉంది ఈ భవనం. ‘ది రీజెంట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్’గా దీన్ని పిలుస్తారు. చూడ్డానికి ఇది అచ్చం ఓ మినీ నగరాన్ని తలపిస్తోంది. ‘s’ ఆకారంలో ఉండే ఈ బిల్డింగ్.. దాదాపు 39 అంతస్తులు ఉంటుంది. దీని ఎత్తు 206 మీటర్లు. కాగా ఇందులో అన్ని కుటుంబాలు కలిపి ఈ బిల్డింగ్ లో 20 వేల మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఇందులో సపరేట్ గా ఫుడ్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, సెలూన్లు, సూపర్ మార్కెట్లు, ఇంటర్నెట్ కేఫ్ ఇలా కావాల్సిన సదుపాయాలన్నీ అందులో ఉన్నాయి. 2.6 లక్షల చ.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ చైనాలోని అతి పెద్ద కట్టడాల్లో ఒకటిగా నిలిచింది.