ల్యాండర్ నుంచి రోవర్ దిగిన వీడియో షేర్ చేసిన ఇస్రో
X
చంద్రయాన్ 3 సక్సెస్తో భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ దేశం అడుగుపెట్టని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఇస్రో పంపిన చంద్రయాన్ 3లో ల్యాండర్ విక్రమ్ నుంచి బయటకు వచ్చిన రోవర్ తన పని కొనసాగిస్తోంది. తాజాగా ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ ఎలా బయటకు వస్తున్న వీడియోను రిలీజ్ చేసింది. రోవర్ ల్యాండర్ నుంచి జారుకుంటూ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన దృశ్యాలను ట్విట్టర్లో పంచుకుంది. ఈ వీడియోను ల్యాండర్ విక్రమ్‌లోని కెమెరా బంధించింది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి రోవర్ కిందికి ఇలా దిగింది’’ అని ఇస్రో క్యాప్షన్ ఇచ్చింది.
... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రోవర్ ప్రజ్ఞాన్ బాగా పనిచేస్తోందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ప్రకటించారు. రోవర్ తన అన్వేషణను మొదలుపెట్టిందని చెప్పారు. ఇది చంద్రుడిపై ఉన్న ఖనిజాలు, వాతావరణం, భూకంపాలు తదితర అంశాలపై అధ్యయనం చేస్తుందని స్పష్టం చేశారు.