92 ఏళ్ల వయసులో 66 ఏళ్ల మహిళతో డేటింగ్ చేస్తున్న రూపర్ట్
X
ప్రపంచ మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియన్ – అమెరికన్ వ్యాపారవేత్త, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch)కు మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఇటీవలే ఆయన.. 92ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. ప్రేయసి ఆన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith)తో జరగాల్సిన పెళ్లి.. నిశ్చితార్ధం వరకూ వచ్చి ఆగిపోయింది. ఇది జరిగిన నెలల వ్యవధిలోనే రూపర్ట్ మర్దోక్ 66 ఏళ్ల ఓ మహిళా సైంటిస్టుతో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. రిటైర్డ్ సైంటిస్టు ఎలెనా ఝుకోవాతో రూపర్ట్ మర్దోక్.. ఓ నౌకపై ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీంతో ఆయన మరోసారి ప్రేమలో పడి ఉండొచ్చని డ్రడ్జ్ అనే వెబ్ సైట్ తెలిపింది. రూపర్ట్ మర్దోక్ మూడో భార్య వెండీ డెంగ్ వీరిద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేసినట్టు తెలిసింది. ఎలెనా ఝకోవా మాలిక్యూల్ బయాలజిస్ట్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మెడికల్ రీసెర్చ్ యూనిట్‌లో ఆమె పని చేశారు.
92ఏళ్ల రూపెర్ట్ మర్దోక్ ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట పెట్రిసియా బుకర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 1960 చివరిలో ఆమెకు విడాకులు ఇచ్చాడు, ఆ తరువాత అన్నా మరియా మన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె వార్తాపత్రిక రిపోర్టర్. వీరిద్దరు 30ఏళ్లకుపైగాకు కలిసి జీవించారు. 1999లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత వెండీ డెంగ్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2013లో విడాకులు ఇచ్చాడు. 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్న మర్దోక్ గతేడాది ఆగస్టు నెలలో ఆమెకుసైతం విడాకులు ఇచ్చాడు. 66ఏళ్ల ఆన్ లెస్లీ స్మిత్‌తో ప్రేమలో పడి ఆమెకు బ్రేక్ అప్ చెప్పాడు. రూపర్ట్ మర్దోక్ తన ముగ్గురు భార్యలకు ఆరుగురు పిల్లలను కన్నారు. న్యూస్ కార్ప్ చైర్మన్, సీఈవో అయిన రూపర్ట్ మర్దోక్ 17 బిలియన్ డాలర్ల ఆస్తిపరుడనే అంచనాలు ఉన్నాయి. ఫాక్స్ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్, ది న్యూయార్క్ పోస్ట్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థల్లో ఆయన పెట్టుబడులు ఉన్నాయి.