Home > అంతర్జాతీయం > Keith Rupert Murdoch : 90 వ పడిలో ఐదవ పెళ్లి

Keith Rupert Murdoch : 90 వ పడిలో ఐదవ పెళ్లి

Keith Rupert Murdoch : 90 వ పడిలో ఐదవ పెళ్లి
X

పైసలుండాలే గానీ.. వయస్సుతో పనేంటి? సత్తా ఉంటే ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చనే మెసేజ్‌ని ఇన్‌డైరెక్ట్‌గా ఇస్తున్నారు ప్రముఖ ఆస్ట్రేలియన్‌-అమెరికన్‌ బిజినెస్ మేన్ రూపర్ట్‌ మర్దోక్‌. 93 ఏండ్ల వయస్సులో 5 వ పెళ్లికి సిద్దమైన ఈ ఓల్డ్ ఏజ్డ్ బిజినెస్ మేన్ పెళ్లిళ్ల గురించి తెలిస్తే షాకవ్వక మానరు. నాలుగు పెళ్లిళ్లు, నాలుగు సార్లు విడాకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్ లోనూ ఎన్నో వివాదాల్లో ఉంటారీయన. నిజానికి లాస్ట్ ఇయర్ మార్చిలోనే ఆన్‌ లెస్లీ స్మిత్‌ అనే 65 ఏండ్ల బ్యూటీతో ఐదో పెళ్లి చేసుకోవాలనుకున్నారు మర్దోక్. కానీ ఎంగేజ్మెంట్ చేసుకున్న నెలరోజులకే.. ఆ పెళ్లి పెటాకులైంది. కానీ ఐదో పెళ్లి చేసుకోవాలన్న ఆయన బలమైన కోరిక మాత్రం అక్కడితో ఆగిపోలేదు. అందుకే ఈసారి తన మాజీ భార్య స్నేహితురాలైన 67 ఏండ్ల ఎలీనా జుకోవాను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవలే ఆమెతో ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిందని, ఈ ఏడాది జూన్‌లో కాలిఫోర్నియాలోని మర్దోక్‌ ఎస్టేట్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని అమెరికా మీడియా ఓ కథనంలో తెలిపింది. ఇప్పటికే వీరు తమ పెళ్లి కార్డులను బంధుమిత్రులకు కూడా పంపించారట. మర్దోక్‌కు ఇది ఐదో పెళ్లి కాగా.. ఎంగేజ్‌మెంట్‌ మాత్రం ఆరవది.





ప్రపంచ మీడియా దిగ్గజంగా, న్యూయార్క్ పోస్ట్ సంస్థ అధినేతగా రూపర్ట్ మర్దోక్ కు గొప్ప పేరుంది. ఈయన సంస్థ ప్రపంచానికి ఎన్నో వార్తలను తెలిపితే.. ఈయన మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఇప్పటికే నలుగురిని పెళ్లాడి.. నలుగురికీ విడాకులిచ్చేసిన మర్దోక్.. గతేడాది మార్చిలో.. ఆన్ లెస్లీ స్మిత్ అనే మహిళను పెళ్లి చేసుకోబోతున్నానని, అదే తనకు చివరి పెళ్లి అని చెప్పారు. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో.. ఈసారి ఎలీనా జుకోవాతో మ్యారేజ్ కి రెడీ అయ్యారు. వీరి పరిచయం కూడా కాస్త సినిమాటిక్ గానే అనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్‌ ఇచ్చిన పార్టీకి వెళ్లారట మర్ధోక్. అదే పార్టీకి వచ్చిన జుకోవాను చూసి మనసు పారేసుకున్నారట. లుక్స్ మ్యాచ్ అవడంతో.. ఇక లేట్ చేయకుండా ఆమెతో డేటింగ్‌ స్టార్ట్ చేసి, నెక్ట్ డెసిషన్ గా పెళ్లికి ఫిక్స్ అయ్యారట.

జుకోవాకు కూడా ఇదేం ఫస్ట్ మ్యారేజ్ కాదు. గతంలో ఆమెకు కూడా అలెగ్జాండర్‌ అనే మాస్కో ఆయిల్‌ బిలియనీర్‌ తో వివాహం జరగ్గా.. ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకుంది. కూతురు కూడా పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో.. ఒంటరి జీవితం గడుపుతున్న ఆమెకు మర్దోక్ తోడుగా నిలవడం నచ్చింది. అందుకే అతని వయస్సు గురించి పెద్దగా పట్టించుకోకుండా పెళ్లికి వెంటనే ఓకే చెప్పింది. మర్ధోక్ గురించి చెప్పుకోవాలంటే.. మీడియా మెఘల్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త. 1950ల్లో మీడియా కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌, ది సన్‌ అనే వార్తా పత్రికలను ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్‌ పోస్ట్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వంటి పబ్లికేషన్స్‌ను తన పలుకుబడితో సొంతం చేసుకున్నారు. 1996లో ఫాక్స్‌ న్యూస్‌ను, 2013లో న్యూస్‌కార్ప్‌ను స్థాపించారు. తన కెరీర్‌లో అనేక వివాదాలు ఎదుర్కొన్న మర్దోక్‌.. ఫోన్‌ హ్యాకింగ్‌ కుంభకోణం కారణంగా న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికను మూసివేశారు. గతేడాది సెప్టెంబరులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించి.. ప్రస్తుతం తన సంస్థలకు గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

93 ఏండ్ల వయసులో.. ఐదో పెండ్లికి సిద్ధమైన బిలియనీర్‌

లేటు వయసులో ఘాటు ప్రేమ..

ఐదో పెళ్లికి సిద్ధమైన 93 ఏళ్ల బిలియనీర్‌

67 ఏండ్ల బ్యూటీతో ప్రపంచ మీడియా దిగ్గజం ఐదోపెళ్లి

‘ఐదో’ పెళ్లి కారణంగా.. మళ్లీ వార్తల్లో నిలిచిన బిలియనీర్‌..

Updated : 8 March 2024 3:53 PM IST
Tags:    
Next Story
Share it
Top