Home > అంతర్జాతీయం > వాగ్నర్ సైన్యంపై రష్యా బాంబు దాడులు.. తగ్గేదే లేదంటున్న ప్రిగోజిన్

వాగ్నర్ సైన్యంపై రష్యా బాంబు దాడులు.. తగ్గేదే లేదంటున్న ప్రిగోజిన్

వాగ్నర్ సైన్యంపై రష్యా బాంబు దాడులు.. తగ్గేదే లేదంటున్న ప్రిగోజిన్
X

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యావైపు నిలబడి, ఇప్పుడు ఆ దేశంపైనే తిరగబడిన కిరాయి సైనిక ముఠా ‘వాగ్నర్’ దళాలు బెంబేలెత్తుతున్నాయి. రష్యా వాయుసేన.. వాగ్నర్ బలగాలపై బాంబుదాడులతో విరుచుకుపడుతోంది. యెవ్‌జనీ ప్రిగోజిన్‌ సారథ్యంలోని వాగ్నర్ వాహన శ్రేణులు శనివారం వోరోనెజ్ హైవే మీదుగా వెళ్తుండగా ఆర్మీ హెలికాప్టర్లు బాంబులు వేశారు. పలు వాహనాలు ధ్వంసమై, దట్టమైన పొగ కమ్మింది. వాగ్నర్ కిరాయి సైనికులు చెరబట్టిన వోరోనెజ్‌లోని చమురు డిపోపైన కూడా రష్యా ఆర్మీ బాంబులు వేసింది. స్థానిక ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో వస్తున్నాయి. వాగ్నర్ ముఠానును తరిమికొడతామని స్థానిక గవర్నర్ చెప్పారు. వాగ్నర్ ముఠా రోస్తోవ్ పట్టణంలోనూ హల్‌చల్ చేస్తోంది. పలు ప్రాంతాల్లో బాంబు దాడులు జరపడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

కొత్త అధ్యక్షు వస్తాడు.. ప్రిగోజన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ పీచమణచివేస్తానని, దేశానికి కొత్త అధ్యక్షుడు వస్తాడని ప్రిగోజిన్ హెచ్చరించాడు. ‘‘మేం దేశద్రోహులం కాదు. దేశాన్ని కాపాడే వీరులం. పుతిన్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు పురిగాయి. పుతిన్‌ చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు. ఆయన పోయి కొత్త అధ్యక్షుడు వస్తాడు,’’ అని మీడియాతో చెప్పారు. మరోవైపు.. పుతిన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని రష్య పార్లమెంటు స్పష్టం చేసింది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే శక్తుల కుట్రను తిప్పికొట్టాలని సైన్యాన్ని కోరింది.

Updated : 24 Jun 2023 7:23 PM IST
Tags:    
Next Story
Share it
Top