Home > అంతర్జాతీయం > చంద్రుడిపై రష్యా ప్రయోగం విఫలం

చంద్రుడిపై రష్యా ప్రయోగం విఫలం

చంద్రుడిపై రష్యా ప్రయోగం విఫలం
X

చంద్రుడిపై రష్యా చేపట్టిన లూనా-25 ప్రయోగం విఫలమైంది. జాబిల్లిపై ల్యాండింగ్కు ముందే లూనా-25 ల్యాండర్‌ కుప్పకూలింది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ అధికారికంగా ప్రకటించింది. చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొనడంతో ల్యాండర్ ధ్వంసమైనట్లు చెప్పింది. శనివారం మధ్యాహ్నం 2:57 గం.ల తర్వాత లూనా-25తో సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. లూనా-25లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వార్తలొచ్చిన కొన్ని గంటలకే అది కుప్పకూలిపోయింది.

దాదాపు 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపై రష్యా ప్రయోగం చేపట్టింది. అగస్ట్ 10 రష్యా జాబిల్లి పైకి లూనా - 25 రాకెట్ను పంపింది. కేవలం 5 రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ నెల 21న

చంద్రుడిపై ఇప్పటి వరకు ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో ల్యాండర్‌ను ల్యాండ్‌ చేయాలని రోస్కాస్మోస్ భావించింది. అయితే గత 24గంటల్లో చంద్రుడిపై పరిస్థితులు మారిపోయాయి. రష్యా పంపిన లూనా - 25 లో సాంకేతిక లోపం వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ల్యాండర్ కుప్పకూలినట్లు రోస్కాస్మోస్ స్పష్టం చేసింది.

అగస్ట్ 23 పైనే..

ఇక చంద్రయాన్-3లో అన్ని ప్రక్రియలు పూర్తికాగా.. కేవలం ల్యాండర్ చంద్రుడిపై దిగడమే మిగిలి ఉంది. చంద్రయాన్ 3లో అర్ధరాత్రి కీలక ఘట్టం పూర్తి అయ్యింది. చివరి డీ-బూస్టింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తైనట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడికి అత్యల్పంగా 25 కి.మీ, అత్యధికంగా 134 కి.మీలో దూరంలో తిరుగుతోంది. విక్రమ్.. ఆటోమేటిక్‌గా ల్యాండింగ్‌ సైట్ ఎంచుకోనుంది. దీంతో అందరి దృష్టి ఆగస్టు 23పైనే ఉంది. ఆగస్ట్‌ 23న సా.5.45గం.లకు ల్యాండింగ్‌ ప్రక్రియ జరగనుంది. సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం అంటూ ఇస్రో ట్వీట్‌ చేసింది.



Updated : 20 Aug 2023 3:20 PM IST
Tags:    
Next Story
Share it
Top