కీవ్‌పై దూసుకొచ్చిన క్షిపణులు..ముగ్గురు మృతి
X
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే . ఇప్పటిదాకా రష్యా దాడుల నుంచి ఆత్మరక్షణ దాడులకే పరిమితమైన ఉక్రెయిన్ ఇప్పుడు నేరుగా మాస్కోలో దాడి చేయడంపై ఉత్కంఠ రేపింది.దీంతో ఉక్రెయిన్ దాడికి ధీటుగా రష్యా క్షిపణులతో విరుచుకుపడింది.
మాస్కోపై డ్రోన్ దాడులు జరిగిన తరువాతి రోజే దాదాపు 10కి పై క్షిపణులు కీవ్‌పైకి దూసుకొచ్చాయి. గురువారం ఉదయం జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉంది. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి మేనెలో కీవ్ పై రష్యా 17 దాడులు చేసింది. ఈ దాడులన్నీ ఎక్కువగా రాత్రిపూట జరిగాయి. తాజాగా దాడులకు సంబంంధించిన చిత్రాలను ఉక్రెయిన్ అధికారులు విడుదల చేశారు. మరోవైపు బుధవారం ఉక్రెయిన్ షెల్లింగ్ కారణంగా లుహాన్స్క్ ప్రాంతంలో ఐదుగురు చనిపోగా..19 మంది గాయపడినట్లు రష్యా తెలిపింది.