Home > అంతర్జాతీయం > పుతిన్‌తో పెట్టుకున్నాడు.. వాగ్నర్‌కు పట్టిన గతే పట్టింది!

పుతిన్‌తో పెట్టుకున్నాడు.. వాగ్నర్‌కు పట్టిన గతే పట్టింది!

పుతిన్‌తో పెట్టుకున్నాడు.. వాగ్నర్‌కు పట్టిన గతే పట్టింది!
X

రష్యా అధ్యక్షుడు వ్లాదిపుర్ పుతిన్‌తో గొడవ పెట్టుకుంటే ఏం జరుగుతుందో ‘వాగ్నర్’ కిరాయికి సైనిక మూక చీఫ్ ప్రిగోజిన్ ఉదంతమే ఉదాహరణ. పుతిన్‌పై కత్తిగట్టిన ప్రిగోజిన్ దారుణంగా హతమారిపోయాడు. తాజాగా.. పుతిన్‌ను విమర్శించిన మాజీ సీనియర్ సైనిక అధికారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. సైన్యంలో ఉన్నత స్థాయికి ఎదిగి ‘ఆర్డర్ ఆఫ్ ద రెడ్ స్టార్’ మెడల్ కూడా పొందిన లెఫ్టినెంట్ జనరల్ స్విరిదోవ్ బుధవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.

స్తావ్‌రొపోల్‌లోని స్వగృహంలోనే అతడు చనిపోయాడని, పక్కనే భార్య శవం కూడా ఉందని రష్యన్ మీడియా తెలిపింది. వీరు చనిపోయి వారం రోజలైనట్లు తెలుస్తోంది. స్విరిదోవ్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ కమాండర్‌గా పనిచేశాడు. 2008లో జార్జియాపై రష్యా చేసిన యుద్ధంలో ఆయన దళాలకు సారథ్యం వహించాడు. ఆయన ఇంట్లో ఎలాంటి గొడవలూ జరగలేదని, విషప్రయోగం జరిపిన ఆనవాళ్లు, మందుగుండు సామగ్రి వంటివేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. స్వెరిదోవ్ పదవిలో ఉన్నప్పుడు.. యుద్ధం విషయంలో రష్యా సింసిద్ధతపై అనుమానాలు వ్యక్తం చేశాడు. పుతిన్‌పై విమర్శలు సంధించాడు. రష్యన్ వాయిసేన పైలట్లు యుద్ధానికి వెళ్లాలంటే 100 గంటలు విమానాలను నడిపి(ఫ్లైట్ టైమ్) ఉండాలని, అయితే ఫ్లైట్ టైమ్ 25 నుంచి 30 గంటలు ఉన్నవాళ్లను యుద్ధానికి పంపుతున్నారని ఆరోపించాడు. సుశిక్షితుల లేకపోవడంతో థర్డ్ ర్యాంక్ పైలెట్లను పంపుతున్నామని, ఇలా జరగడం ఇదే తొలిసారి అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శించాడు. తక్కువ జీతాలున్న పైలట్ల అంశాన్ని కూడా ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలో ఆయన అనుమానాస్పదంగా మృతిచెందాడు. పుతిన్‌ను విమర్శించిన వాళ్లకు ఏ గతి పడుతుందో స్విరిదోవ్‌కు కూడా అదే గతి పట్టిందని కథనాలు వెలువడుతున్నాయి. former

Updated : 16 Nov 2023 10:53 PM IST
Tags:    
Next Story
Share it
Top