కరెంట్ తీగలకు తాకిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం
Lenin | 28 July 2023 10:06 AM IST
X
X
రష్యాలోని సైబీరియాలో దారుణ ఘటన జరిగింది. ఓ హెలిక్యాప్టర్ ల్యాండ్ అవుతుండగా కరెంట్ తీగలకు తాకి పేలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఎంఐ-8 హెలిక్యాప్టర్ దక్షిణ సైబీరియాలోని ఆల్టై రిపబ్లిక్ కు వెళ్లింది. అక్కడ ల్యాండ్ అవుతుండగా కరెంట్ తీగలకు తాకి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ఎగసిపడి హెలిక్యాప్టర్ పేలిపోయింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ప్రమాదానికి గురైన హెలిక్యాప్టర్ ప్రైవేట్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు అధికారులు. ఆ హెలిక్యాప్టర్ సైబీరియాకు పర్యాటకులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ హెలిక్యాప్టర్ లో 15 మంది ప్రయాణికులు, 3 సిబ్భంది ఉన్నారు.
Updated : 28 July 2023 10:06 AM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire