Home > అంతర్జాతీయం > చంద్రునిపై లూనా - 25 కూలిన చోట భారీ గొయ్యి

చంద్రునిపై లూనా - 25 కూలిన చోట భారీ గొయ్యి

చంద్రునిపై లూనా - 25 కూలిన చోట భారీ గొయ్యి
X

చంద్రునిపై అధ్యయనం కోసం రష్యా చేపట్టిన లూనా - 25 మిషన్ అట్టర్ ఫ్లాపైంది. ఆ స్పేస్ క్రాఫ్ట్ చంద్రునిపై కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో స్పేస్ క్రాఫ్ట్ ధాటికి దాదాపు 10 మీటర్ల విస్తీర్ణంలో గుంత ఏర్పడింది. ఈ విషయాన్ని నాసా ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 19న దాదాపు 47 ఏండ్ల తర్వాత రష్యా చంద్రునిపై రాకెట్ పంపింది. అయితే దాని స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో కుప్పకూలింది.

లూనా - 25 కూలిన ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి గురించి నాసాకు చెందిన లూనార్ రికగ్నెసెన్స్ ఆర్బిటార్ ఫోటోలు రిలీజ్ చేసింది. ఆ గుంత దాదాపు 10 మీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు నాసా ప్రకటించింది. లూనా 25 ల్యాండ్ కావాల్సిన పాయింట్ సమీపంలో ఆ గొయ్యి ఉందని, అది లూనా వల్లే జరిగిందని చెప్పింది. ఇదిలా ఉంటే లూనా - 25 విఫలం కావడంపై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ర‌ష్యా ప్ర‌త్యేక క‌మీష‌న్ ఏర్పాటు చేసింది. ఇస్రో లాగే రష్యా సైతం చంద్రునిపై దక్షిణ ధ్రువాన్ని టార్గెట్ చేస్తూ లూనా - 25 మిషన్ చేపట్టింది.


Updated : 1 Sept 2023 4:23 PM IST
Tags:    
Next Story
Share it
Top