Home > అంతర్జాతీయం > భూమిపై 8వ ఖండం ఇదే... ఎక్కడుంది, ఏమైంది?

భూమిపై 8వ ఖండం ఇదే... ఎక్కడుంది, ఏమైంది?

భూమిపై 8వ ఖండం ఇదే... ఎక్కడుంది, ఏమైంది?
X

ఖండాలు ఏడు అని మనకు తెలుసు. కానీ నిజానికి ఖండాలు ఎనిమిది అంటూ శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. 375 ఏళ్లుగా సాగతున్న అన్వేషణ ఫలించి 8వ ఖండం రూపురేఖలు ప్రస్ఫుటమయ్యాయి. కనుమరుగైన ‘జీలాండియా’ ఖండం మ్యాపును అంతర్జాతీయ పరిశోధకులు పూర్తి స్థాయిలో తయారు చేశారు.

ప్రస్తుతం 6 శాతం భూమిపై మిగతా భాగం సముద్రంలో కలిసిపోయిన జీలాండియా గురించి డచ్ అన్వేషకుడు అబెల్ తాస్మాన్ 1642లో తొలిసారి ప్రస్తావించి 8వ ఖండం అన్నారు. తర్వాత 1895లో స్కాట్లాండ్ ప్రకృతి శాస్త్రవేత్త జేమ్స్‌ హెక్టర్‌ మరింత అధ్యయనం చేశారు. 1995లో అమెరికన్‌ జియోఫిజిసిస్ట్‌ బ్రూస్‌ లుయెండి జీలాండియాకు ఒక ఖండానికి ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయన్నాడు. దానికి ఆ పేరు పెట్టింది లుయెండీనే. అయితే అది భూమి ఉపరితలంపై లేదు కాబట్టి, ఖండంగా పరిగణించలేమని శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు.




2017లో జీలాండియాకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం న్యూజీలాండ్, దాని చుట్టుపక్కల ఉన్న దీవులు ఈ ఖండంలో భాగం. ఈ ప్రాంతాలు మినహా మిగిలిన ఖండమంతా సముద్రంలో కలిసిపోయింది. జీలాండియా విస్తీర్ణం 49 లక్షల చదరపు కిలోమీటర్లు. ప్రస్తుత మడగాస్కర్ దీవికంటే ఆరు రెట్లు పెద్దదైన జీలాండియా దాదాపు 55 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చని అంచనా. ఈ ఖండం మిగతా ఖండాలకన్నా వయసులోనూ, విస్తీర్ణంలోనూ చిన్నది, మందం తక్కువ. ఇందులో అనేక నదీపరీవాహ ప్రదేశాలు, అగ్నిపర్వత అవశేషాలు ఉండేవి. జంతుజాలం కూడా మిగతా ఖండాలకు భిన్నంగా ఉండేదని శిలాజాలు ద్వారా నిర్ధారించారు. ఈ ఖండంలో ఖండాల్లానే మనిషి నివసించడానికి కావల్సిన అవసరమైన అన్ని వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పశ్చిమ అంటార్కిటికా భౌగోళిక స్వరూపాన్ని పోలినట్టు ఉండే ఈ ఖండం 3,500 అడుగుల లోతులో ఉంది. జీలాండియా ఎలా కనుమరుగైందో తెలిస్తే మన భూగ్రహంపై, ఖండాలపై కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.





Updated : 30 Sept 2023 7:38 PM IST
Tags:    
Next Story
Share it
Top