Home > అంతర్జాతీయం > అయిపోతున్న ఆక్సిజన్.. ఇంకా దొరకని టైటాన్ ఆచూకీ

అయిపోతున్న ఆక్సిజన్.. ఇంకా దొరకని టైటాన్ ఆచూకీ

అయిపోతున్న ఆక్సిజన్.. ఇంకా దొరకని టైటాన్ ఆచూకీ
X

టైటానిక్ షిప్..విహార యాత్ర కోసం వెళ్లిన ఈ భారీ షిప్ ఎన్నో జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ షిప్ ప్రమాదానికి గురై ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ వార్తల్లో ఏదో రకంగా నిలుస్తూనే ఉంటుంది. తాజాగా సముద్రం అడుగున ఉన్న ఈ టైటానిక్ షిప్‎ శిథిలాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల సబ్‎మెరైన్ మిస్ కావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. దీంతో ప్రయాణికుల ఆచూకి కోసం హుటాహుటిన గాలింపు చర్యలు మొదలుపెట్టారు.





సముద్రంలో అణువణువు అన్వేషిస్తున్నా టైటాన్ ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఇప్పటికే దాంట్లో ఆక్సిజన్ నిల్వలు దాదాపు అయిపోవడానికి వచ్చాయి. ఒకవేళ అదే జరిగితే వారు ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. సముద్ర అంతర్భాగం నుంచి శబ్దాలు వస్తున్నట్ల కెనడా సైనిక నిఘా విమానం కనిపెట్టడం ఆశలు రేకెత్తిస్తోంది. టైటాన్‌ గల్లంతయినట్లు భావిస్తున్న ప్రాంతం నుంచి ప్రతి 30 నిమిషాలకోసారి శబ్దాలు వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ శబ్దాలు టైటాన్‌కు సంబంధించినవేనా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు





అమెరికా, కెనడా రక్షక దళాలు సముద్ర ప్రాంతాన్ని జల్లెడపడుతున్నా అనుకున్నంత పురోగతి మాత్రం లభించడం లేదు. ఈ క్రమంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. టైటాన్ లోని వ్యక్తులు బతికి బయటపడే అవకాశం లేదు. ఈ జలాంతర్గామిలో బ్రిటన్ చెందిన బిలయనీర్ హమీష్ హార్డింగ్ ఉన్నారు. ఈ సాహస జర్నీని ప్రారంభించిన 1.45 గంటల్లోనే సబ్‎మెరైన్ కమ్యూనికేషన్‌ను కోల్పోయింది. మరికొన్ని గంటల్లో ఆక్సిజన్ అయిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.




Updated : 22 Jun 2023 7:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top