Home > అంతర్జాతీయం > భారీ నౌకలో అగ్నిప్రమాదం..3 వేల కార్లు బుగ్గిపాలు

భారీ నౌకలో అగ్నిప్రమాదం..3 వేల కార్లు బుగ్గిపాలు

భారీ నౌకలో అగ్నిప్రమాదం..3 వేల కార్లు బుగ్గిపాలు
X

జర్మనీ నుంచి ఈజిప్టుకు వెళ్తున్న భారీ నౌక, డచ్ తీరంలో అగ్నిప్రమాదానికి గురైంది. నౌకలో దాదాపు 3 వేల కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రమాదాన్ని అంచనా వేసిన నౌక సిబ్బంది ప్రాణాలను రక్షించుకునేందుకు సముద్రంలోకి దూకేశారు. దాదాపు 23 మంది ప్రమాదం నుంచి తప్పించుకోగా ఒకరు మరణించారు. నౌకలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రావడం లేదు. ఈ మంటలు కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలిసిరాలేదు. ఎలక్ట్రిక్ కార్ల వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

పనామాలో రిజిస్టర్ అయిన 199 మీటర్ల పొడవున్న ఫ్రెమాంటల్ హైవే భారీ నౌకలో హటాత్తుగా మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడం, వాటిని అదుపుచేసే అవకాశం లేకపోవడంతో నౌకలోని 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. తమ ప్రాణాలు కాపాడుకున్నారు. విషయం తెలుసుకుని రెస్క్యూ షిప్‌లు నౌక వద్దకు చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. మంటలు ఆర్పేందుకు అధిక నీటిని నౌకపైకి స్ప్రే చేస్తే అది మునిగిపోయే ప్రమాదం ఉండటంతో డెక్‌పై కాకుండా పక్కలకు మాత్రమే నీటిని స్ప్రే చేస్తున్నట్టు రెస్కూ షిప్ సిబ్బంది తెలిపినట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో నౌకలోని 3 వేల కార్లు అగ్గిపాలయ్యాయి. భారీ నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా నౌకలోని సిబ్బంది ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సముద్రంలోకి దూకడంతో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారంతా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో వారి ఎముకలు విరగడంతో పాటు కాలిన తీవ్రమైన గాయాలు అయినట్లు డచ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి మృతి చెందారు.









Updated : 27 July 2023 8:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top