డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తే ఇంత కఠినమైన శిక్షా..? వారంలోనే ముగ్గురికి..
X
తప్పు చేస్తే శిక్ష అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు. ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమే. వారు వారు చేసిన తప్పులను బట్టి శిక్షలు పడుతుంటాయి. అయితే ఉరిశిక్షలు మాత్రం చాలా రేర్ కేసుల్లో మాత్రమే న్యాయస్థానాలు విధిస్తుంటాయి. కానీ సింగపూర్‌లో మాత్రం అలా కాదు. అక్కడి ప్రభుత్వం డ్రగ్ ట్రాఫికింగ్ కేసులను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ కేసులో దోషులుగా తేలివారికి కఠినమైన శిక్షలను వేస్తోంది. ఏకంగా దోషులకు ఉరిశిక్షలు విధిస్తూ యావత్త్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. తాజాగా సింగపూర్ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మూడు ఉరిశిక్షలను అమలు చేసింది. ఏడాది సమయంలోనే 5 ఉరిశిక్షలు వేయడం గమనార్హం. వరుసగా ప్రభుత్వం ఉరిశిక్షలు వేయడంతో అటు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మాదక ద్రవ్యాల రవాణా కేసుల విషయంలో సింగపూర్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా సర్కార్ గురువారం మరో వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేసింది. వారం రోజుల వ్యవధిలో ఇది మూడో ఉరిశిక్ష కావడం గమనార్హం. ఈ సంవత్సరంలో వేసిన ఉరిశిక్షల్లో ఇది ఐదవది. 2019 సంవత్సరంలోలో మహ్మద్ అదుల్ లతీఫ్ అనే వ్యక్తి 55 గ్రాముల హెరాయిన్‌తో నార్కోటిక్స్ ఆఫీసర్లకు దొరికొపోయాడు. కేసు విచారణలో లతీఫ్ దోషిగా తేలాడు. దీంతో న్యాయస్థానం అతడికి ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో గురువారం లతీఫ్‌కు శిక్ష అమలు పరిచింది. ఈ విషయాన్ని సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ప్రకటించింది.
కొవిడ్ కారణంగా ఉరిశిక్షలకు రెండేళ్లు విరామం ఇచ్చింది సింగపూర్ సర్కార్. గత సంవత్సరం నుంచే మళ్లీ శిక్షలను అమలు చేయడం స్టార్డ్ చేసింది. ఇప్పటి వరకు సింగపూర్ ప్రభుత్వం 11 మందికి ఉరి శిక్ష అమలు చేసింది. గత వారమే డ్రగ్స్ ట్రిఫికింగ్ కేసులో ఓ మహిళకు ఉరి శిక్ష అమలు చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సింగపూర్ ప్రభుత్వం మొదటిసారిగా ఓ మహిళకు ఉరి వేసింది. సింగపూర్ సర్కార్ తీరుపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.