Home > అంతర్జాతీయం > Snapchat : ఉద్యోగులకు షాకిచ్చిన స్నాప్‌చాట్‌.. 500 మందిపై వేటు

Snapchat : ఉద్యోగులకు షాకిచ్చిన స్నాప్‌చాట్‌.. 500 మందిపై వేటు

Snapchat : ఉద్యోగులకు షాకిచ్చిన స్నాప్‌చాట్‌.. 500 మందిపై వేటు
X

ఐటీ రంగాల్లో ఉద్యోగుల కోత ఇంకా ఆగడం లేదు. ప్రతి రోజూ ఏదోక కంపెనీ తమ ఉద్యోగులను తొలగించామంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి. టెక్ రంగంలో లేఆఫ్స్ ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కరోనా తర్వాత ఉద్యోగుల కోత మొదలైంది. ముఖ్యంగా 2023లో టెక్ కంపెనీలతో పాటుగా స్టార్టప్ కంపెనీలు సైతం భారీ సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఇప్పుడు ప్రముఖ ఇన్‌స్టంట్ మెస్సేజింగ్ యాప్ అయిన స్నాప్‌చాట్ లేఆఫ్స్ ప్రకటించింది.

తమ కంపెనీ నష్టాల్లో పడకుండా ముందుకు నడిపించడం కోసం ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లుగా స్నాప్‌చాట్ తెలిపింది. గ్లోబల్ వర్క్ ఫోర్స్‌లో భాగంగా 10 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఫుల్ టైమ్ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. స్నాప్‌చాట్ సంస్థలో ప్రస్తుతం 5,367 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా నిర్ణయంతో 540 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.

స్నాప్‌చాట్ కంపెనీతో పాటుగా ఈనెలలో మరో కంపెనీ తమ ఉద్యోగులను తొలగించింది. ఓక్టా ఇన్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఫిబ్రవరి నెలలోనే లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి తమ ఉద్యోగులలో 7 శాతం మందిని అంటే 400 మందిని తొలగించింది. కంపెనీ నిర్ణయంతో ఈ నెల ఆఖరికి 400 మంది తమ ఉద్యోగాలను కోల్పోతారు.

Updated : 6 Feb 2024 4:22 PM IST
Tags:    
Next Story
Share it
Top