Home > అంతర్జాతీయం > పిల్లల్ని కంటే భారీ నగదు బహుమతి

పిల్లల్ని కంటే భారీ నగదు బహుమతి

పిల్లల్ని కంటే భారీ నగదు బహుమతి
X

చాలా దేశాల్లో జననాల రేటు భారీగా తగ్గిపోతోంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో జనాభా బాగా తగ్గిపోవడంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలను అందించనున్నాయి. ఈ తరుణంలో జననాల రేటును పెంచేందుకు ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా అందించేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఓ సంస్థ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో ఉద్యోగులు కచ్చితంగా పిల్లల్ని కనాలని, అలా పిల్లల్ని కన్న వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేస్తామని అవి ప్రకటించాయి. పిల్లల్ని కన్న ప్రతిసారీ 100 మిలియన్ కొరియన్ వోన్‌లు అంటే 75000 డాలర్లు ఇస్తామని ప్రకటించాయి. అంటే భారత కరెన్సీలో ఆ మొత్తం దాదాపు రూ.63 లక్షలుగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బంపరాఫర్ అందర్నీ ఆకర్షిస్తోంది.

దక్షిణ కొరియా దేశానికి చెందిన బూయోంగ్ గ్రూపు 2021 నుంచి పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలను ఇచ్చే పథకాన్ని చేపట్టింది. ఆ పథకం వల్ల గత మూడేళ్లలో 70 మంది పిల్లల్ని తమ ఉద్యోగులు కన్నారు. వారికి 5.25 మిలియన్ డాలర్లు ఆ కంపెనీ అందించింది. ఆ ప్రోత్సాహకానికి మహిళ, పురుష ఉద్యోగులు అర్హులేనని వెల్లడించింది. దేశ భవిష్యత్తు కోసం తాము అలాంటి పథకాన్ని తీసుకొచ్చినట్లు బూయోంగ్ గ్రూప్ ఛైర్మన్ లీ జూంగ్ కీన్ వెల్లడించారు. 2002 వరకూ చూస్తే ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు దక్షిణ కొరియాలోనే నమోదైంది.

పిల్లల్ని కంటే భారీగా నగదు బహుమతి2025లో ఆ దేశంలో సంతానోత్పత్తి భారీగా తగ్గిపోనుంది. ఈ మేరకు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను కూడా ప్రోత్సహిస్తోంది. 1983లో స్థాపించిన బూయోంగ్ గ్రూప్ సంస్థలో ప్రస్తుతం 2.70 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి సంక్షేమం కోసం, దేశంలో జననాల రేటు పెంచడం కోసం ఆ కంపెనీ కొత్త కొత్త పథకాలను తీసుకొస్తూ ముందుకు సాగుతోంది. పిల్లల్ని కంటే రూ.62 లక్షలు ప్రోత్సాహకం ఇస్తామనే ప్రకటనతో ఆ కంపెనీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated : 10 Feb 2024 9:52 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top