Home > అంతర్జాతీయం > Fake Birth Certificate Case: నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఆజం ఖాన్‌కు షాక్‌..

Fake Birth Certificate Case: నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఆజం ఖాన్‌కు షాక్‌..

Fake Birth Certificate Case: నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఆజం ఖాన్‌కు షాక్‌..
X

ఫేక్​ బర్త్​ సర్టిఫికెట్ల ​కేసులో ఉత్తరప్రదేశ్​కు చెందిన సమాజ్‌‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్, అతని భార్య తజీన్ ఫాతిమా, కొడుకు అబ్దుల్లా ఆజంకు ఏడేండ్ల జైలు శిక్ష పడింది . తప్పుడు జనన ధృవపత్రాలు ఇచ్చారన్నకేసులో వారి ముగ్గురికికి జైలు శిక్ష పడింది. నకిలీ జనన ధ్రువపత్రం కేసులో వారిని కూడా దోషులుగా తేల్చిన స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..

సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కొడుకు అబ్దుల్లా ఆజంఖాన్ జనవరి 1, 1993లో పుట్టినట్లుగా తెలుపుతూ రాంపూర్ మున్సిపాలిటీ ఒక ధ్రువపత్రం ఇచ్చింది. కాగా, అబ్దుల్లా ఆజంఖాన్ 1990, సెప్టెంబర్ 30న లఖ్ నవూలో పుట్టినట్లుగా మరో సర్టిఫికెట్ ఉంది. అబ్దుల్లా ఆజంఖాన్ నకిలీ జనన ధ్రువపత్రాలు తీసుకోవడంలో ఆయన తల్లిదండ్రులైన తజీన్ ఫాతిమా, ఆజంఖాన్లు కూడా సహకరించారని ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్ లోని గంజి పోలీస్ స్టేషన్లో 2019 జనవరి 3 న ఫిర్యాదు చేశారు.

దీనిపై ఎంక్వైరీ చేసిన పోలీసులు.. లక్నోలో తీసుకున్న సర్టిఫికెట్​లో అబ్దుల్లా ఆజం పుట్టిన తేదీ సెప్టెంబర్ 30, 1990 అని ఉందని, రాంపూర్ మున్సిపాలిటీ జారీ చేసిన సర్టిఫికెట్‌‌లో జనవరి 1, 1993 అని ఉన్నట్టు చార్జ్​షీట్​లో పేర్కొన్నారు. విచారణ అనంతరం యూపీలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు మెజిస్ట్రేట్ షోబిత్ బన్సాల్ ముగ్గురికి ఏడేండ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత, ఆ ముగ్గురినీ జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారని, వారిని కోర్టు నుంచే జైలుకు తరలిస్తారని ప్రాసిక్యూషన్ తరపున వాదించిన మాజీ జిల్లా ప్రభుత్వ అడ్వొకేట్​ అరుణ్ ప్రకాశ్​ సక్సేనా తెలిపారు.

ఇదిలా ఉండగా.. అబ్దుల్లా ఆజం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సువార్ నియోజకవర్గం నుంచి ఎస్పీ టికెట్‌‌పై గెలిచాడు. 2008లో ప్రభుత్వ ఉద్యోగిని నిర్బంధించి, దాడికి పాల్పడిన కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొరాదాబాద్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేండ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన రెండ్రోజుల తర్వాత అతడు ​ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి అనర్హుడయ్యాడు.

Updated : 19 Oct 2023 11:07 AM IST
Tags:    
Next Story
Share it
Top