Home > అంతర్జాతీయం > ఈ కారు ఇంటిమీదికెక్కి యాక్సిడెంట్ ఎలా చేసింది? వైరల్ ఫోటోలు

ఈ కారు ఇంటిమీదికెక్కి యాక్సిడెంట్ ఎలా చేసింది? వైరల్ ఫోటోలు

ఈ కారు ఇంటిమీదికెక్కి యాక్సిడెంట్ ఎలా చేసింది? వైరల్ ఫోటోలు
X

ప్రమాదాలు చాలావరకు అనూహ్యంగా జరుగుతుంటాయి. వెంట్రుక వాసి తేడాలో తప్పిపోతుంటాయి కూడా. కానీ కొన్ని ప్రమాదాలు ఎవరూ కలలో సైతం ఊహించని విధంగా జరుగుతుంటాయి. రోడ్డు మీద రివ్వుమని దూసుకెళ్తున్న ఓ కారు ఓ ఇంటి మేడమీదికి దూసుకెళ్లి వార్తలకెక్కింది. మిద్దెపై వేలాడుతున్నఆ బండి అసలు అక్కడికెలా వెళ్లిందని చూసిన వాళ్లు తల బాదుకుంటున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం అల్ఫరటా ప్రాంతంలో ఆదివారం ఈ విచిత్రం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు డికేటర్ టౌన్‌షిప్‌లోని ఓ ఇంటి పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో అమాంతంగా ఎగిరిపడింది. ఫస్ట్‌ఫ్లోర్ లోపలికి దూసుకెళ్లి బీభత్సం సృష్టించి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో మేడగదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకుని కారు డ్రైవర్‌ను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.














Updated : 8 Aug 2023 4:10 PM IST
Tags:    
Next Story
Share it
Top