Home > అంతర్జాతీయం > శ్రీలంకకు ఇక వీసా లేకుండానే వెళ్లొచ్చు.. డబ్బు కోసం ఎత్తేశారు..

శ్రీలంకకు ఇక వీసా లేకుండానే వెళ్లొచ్చు.. డబ్బు కోసం ఎత్తేశారు..

శ్రీలంకకు ఇక వీసా లేకుండానే వెళ్లొచ్చు.. డబ్బు కోసం ఎత్తేశారు..
X

పొరుగు దేశమైన అందాల శ్రీలంకకు భారతీయులు ఇకపై మరింత సులభంగా వెళ్లొచ్చు. భారత్ సహా ఏడు దేశాల పౌరులు వీసాలు లేకుండానే తమ రావొచ్చుని లంక ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ దెబ్బ, రాజసంక్షోభంతో కుదేలైన లంక ఆదాయాన్ని పెంచుకోవడానికి వీసా నిబంధన ఎత్తేసింది. భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ ప్రజలు ఇకపై వీసాల లేకుండా లంకలో పర్యటించవచ్చు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. ఈ సదుపాయం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద 2004 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదికి చివరికి 20 లక్షల మంది విదేశీ పర్యాటకులను తమ దేశానికి రప్పించాలని లంక లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఆ దేశానికి పర్యాటక రంగమే ప్రధాన ఆదాయన వనరు కావడంతో ఆంక్షలను సడలిస్తోంది. ఇటీవల చైనాకు దగ్గవుతున్న లంక వ్యూహాత్మక ఇరుగుపొరుగు దేశాలతోపాటాటు రష్యా, జపాన్‌ల ప్రాపకం కోసం కూడా ప్రయత్నిస్తోంది.

శ్రీలంక వెళ్లే విదేశీ పర్యాటకుల్లో భారతీయులే ఎక్కువ. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 30 వేల భారతీయులు లంకకు వెళ్లారు. చైనా నుంచి 8 వేల మంది వెళ్లారు. 2019 నాటి ఈస్టర్ సండే బాంబుపేలుళ్ల తర్వాత లంకకు పర్యాటకులు తగ్గారు. ఆ దాడుల్లో 11 మంది భారతీయులు సహా 270 మంది బలయ్యారు.


Updated : 24 Oct 2023 1:58 PM IST
Tags:    
Next Story
Share it
Top