Japan : జపాన్ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Kiran | 1 Jan 2024 1:59 PM IST
X
X
న్యూ ఇయర్ రోజున జపాన్ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.4గా నమోదైంది. భారీ భూకంపం నేపథ్యంలో జపాన్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరిక జారీ చేసింది. సముద్రానికి దగ్గరగా ఉన్న ఇషికావా, నీగట, తొయామా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇషికావా వద్ద దాదాపు 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. వాజిమా నగర తీరాన్ని ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకాయి. భారీ భూ ప్రకంపనలతో కారణంగా అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం పడిందా అని తనిఖీ చేస్తున్నామని హొకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. భారీ భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియలేదు.
Updated : 1 Jan 2024 1:59 PM IST
Tags: international news japan earthquake ritcher scale japan weather department waves tsunami warning ishikawa nigata Noto Wajima City
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire