Home > అంతర్జాతీయం > యూరప్లో ‘రైనా’ రెస్టారెంట్.. ‘మన రుచులు వాళ్లకు కూడా తెలియాలిగా..’

యూరప్లో ‘రైనా’ రెస్టారెంట్.. ‘మన రుచులు వాళ్లకు కూడా తెలియాలిగా..’

యూరప్లో ‘రైనా’ రెస్టారెంట్.. ‘మన రుచులు వాళ్లకు కూడా తెలియాలిగా..’
X

టీమిండియాకు దక్కిన డాషింగ్ బ్యాటర్, మెరుపు ఫీల్డర్స్ ఒకరు సురేష్ రైనా. ఇంతకాలం గ్రౌండ్ లో అలరించిన రైనా.. ఇప్పుడు గరిటె పట్టాడు. అవును.. తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. అయితే, ఈ రెస్టారెంట్ లో ఫుడ్ టేస్ట్ చేయాలంటే మాత్రం యూరప్ వెళ్లాల్సిందే.

నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో.. మన భారతీయ రుచులతో.. ఇండియన్ రెస్టారెంట్ ను ప్రారంభించాడు. దానికి ‘రైనా ఎస్ఆర్.. కల్టినరీ ట్రెజర ఆఫ్ ఇండియా’ అని పేరు పెట్టాడు. ఇందులో మొత్తం భారతీయ వంటకాలే ఉండటం ప్రత్యేకం. ఈ విషయాలను వివరిస్తూ రైనా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫొటోలు పోస్ట్ చేశాడు. భారతీయ రుచులను యూరప్ దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా ఈ రెస్టారెంట్ ను ఓపెన్ చేసినట్లు రైనా వివరించాడు.

స్వయానా భోజన ప్రియుడైన రైనా.. రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా వంట కూడా చేశాడు. ‘ఉత్తర భారతంకు చెందిన మసాలా వంటకాలు, దక్షిణ భారతానికి చెందిన ఘుమఘుమలతో ఇక్కడి వాళ్ల నోరూరిస్తాం’ అని రైనా తెలిపాడు.





Updated : 23 Jun 2023 7:20 PM IST
Tags:    
Next Story
Share it
Top