Home > అంతర్జాతీయం > Worlds tallest dog:గిన్నిస్ రికార్డ్ సాధించిన కుక్క.. బోన్ క్యాన్సర్ తో మృతి

Worlds tallest dog:గిన్నిస్ రికార్డ్ సాధించిన కుక్క.. బోన్ క్యాన్సర్ తో మృతి

Worlds tallest dog:గిన్నిస్ రికార్డ్ సాధించిన కుక్క.. బోన్ క్యాన్సర్ తో మృతి
X

ప్రపంచంలోనే అత్యంత పొడవైన, బరువైన కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న జ్యూస్ మరణించింది. మూడు సంవత్సరాల జ్యూస్.. గ్రేట్ డేన్ జాతికి చెందింది. గత కొంత కాలంగా ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న జ్యూస్ సెప్టెంబర్ 12న చనిపోయింది. ఇది 1.046 మీటర్లు (3 అడుగుల 5.18 అంగుళాలు) పొడవుతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. టెక్సాస్ లోకి బెడ్ ఫోర్డ్ లో నివసించేది. జ్యూస్ కు న్యుమోనియా వ్యాధి సోకగా.. ఇటీవల దాని తీవ్రత పెరిగింది. దాంతో పరిస్థితి విషమించి మృత్యువు ఒడికి చేరుకుంది.





ఈ వార్తను జ్యూస్ ఓనర్ బ్రిటనీ డేవిస్ వెల్లడించారు. ‘మా మగబిడ్డ జ్యూస్ మమ్మల్ని వదిలిపెట్టి వెల్లిపోయాడు. తన వ్యాధితో ఇంతకాలం ధైర్యంగా పోరాడింది. కానీ విధి వక్రీకరించి తన ప్రాణాలను తీసుకెళ్లిపోయింది.’ జ్యూస్ కు వచ్చిన బోన్ క్యాన్సర్ చికిత్స కోసం 12 వేల డాలర్లను సేకరించారు. సెప్టెంబర్ 7న జరిగిన సర్జరీలో అది సక్సెస్ అయింది. అయితే సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో సర్జరీ జరిగిన మూడు రోజుల వరకు ఏమీ తినలేకపోయింది. ఆ తర్వాత నీరసించిపోయింది. నోరు నీలం రంగులోకి మారింది. దానికి న్యుమోనియా వచ్చిందని డాక్టర్ భావించి చికిత్స అందించారు. కానీ అది ఫలించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిందని బ్రిటనీ డేవిస్ చెప్పుకొచ్చింది.







Updated : 15 Sep 2023 11:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top