టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు మళ్లీ పాప..ఫోటోలు వైరల్
X
అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి తల్లైంది. 41 ఏళ్ల వయసులో సెరెనా రెండోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సెరెనా భర్త ప్రముఖ బిజినెస్మెన్ అలెక్సిస్ ఒహానియన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతే కాదు తన చిన్నారి కూతురు ఫొటోలను నెట్టింట్లో షేర్ చేశారు. తన రెండో పాపకు అధీరా రివర్ ఒహానియా అని పేరు కూడా పెట్టినట్లు ఆయన నెటిజన్స్‌కు సెరెనా అభిమానులకు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా, సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. తమ అభిమాన టెన్నిస్ స్టార్ మరోసారి తల్లి కావడంతో సెరెనా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా సెరెనా భర్త అలెక్సిస్ ఒహానియా తన ఆనందాన్ని తెలుపుతూ.."ఇప్పుడు మా ఇల్లంతా ఎంతో సందడితో, ఆనందంతో నిండిపోయింది. సెరెనా నాకు మరో అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. సెరెనా, గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ ఆల్‌టైమ్ " అంటూ భార్యపై ప్రశంసలు కురిపించారు అలెక్సిస్. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే సెరెనా-అలెక్సిస్‌కు ఇదివరకే ఓ పాప ఉంది. ఆరేళ్ల క్రితమే సెరెనాకు ఓ అమ్మాయి పుట్టింది.