Home > అంతర్జాతీయం > Cybertruck: బుల్లెట్ల వర్షం కురిపించినా చెక్కుచెదరని టెస్లా కారు.. వీడియో

Cybertruck: బుల్లెట్ల వర్షం కురిపించినా చెక్కుచెదరని టెస్లా కారు.. వీడియో

Cybertruck: బుల్లెట్ల వర్షం కురిపించినా చెక్కుచెదరని టెస్లా కారు.. వీడియో
X

ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఉండే క్రేజ్‌ వేరు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ... ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ సైబర్ ట్రక్‌ను అమెరికాలో గ్రాండ్‌గా ఆవిష్కరించారు. కేవలం ఆవిష్కరించడం మాత్రమే కాక దాని పనితీరుని వివరిస్తూ పలు టెస్టింగ్ వీడియోలు విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఆ ట్రక్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోలు చూసి టెస్లా సరికొత్త ప్రొడక్ట్ తో జనమంతా ఆశ్చర్యపోతున్నారు. ట్రక్ మొత్తం పూర్తి బుల్లెట్ ప్రూఫ్ తో తయారవ్వడమే దీని ప్రత్యేకత. వాస్తవానికి ఈ సైబర్ ట్రక్ ను నాలుగేళ్ల క్రితమే ఆవిష్కరించారు. అయితే పలు విధాలుగా పరీక్షలు చేసిన తర్వాత ఎట్టకేలకు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి కారుపై బుల్లెట్ల వర్షం కురిపించి, నాణ్యతను తనిఖీ చేశారు. ఈ క్రమంలో రోబోలతో చేసిన ఓ పరీక్ష ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఈ సైబర్ ట్రక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు టెస్లా అనేక రకాల టెస్టులు నిర్వహించింది. అందులో భాగంగానే రోబోలతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సైబర్ ట్రక్ ను ఓ రోబో డ్రైవ్ చేస్తుండగా.. మరో రోబో ఆ కారుపై గన్ తో బుల్లెట్ల వర్షం కురిపించింది. అయినప్పటికీ ఆ కారుకు చిన్న డ్యామేజ్ కూడా కాకపోవడం విశేషం. సైబర్ ట్రక్ శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు టెస్లా.. ఈ కారు టెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

టెస్లా సైబర్ ట్రక్ లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి సైబర్‌బీస్ట్, ఆల్ వీల్ డ్రైవ్ ట్రెయిన్ మరియు రియర్-వీల్ డ్రైవ్ కాగా.. వీటిలో ప్రస్తుతం టెస్లా ఆల్ వీల్ డ్రైవ్ ట్రెయిన్, సైబర్ బీస్ట్ వేరియంట్లు మాత్రమే డెలివరీలకు అందుబాటులో ఉంచింది. మరో వేరియంట్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ సైబర్ ట్రక్ మూడు వేరియంట్ల ధరలను ఓ సారి పరిశీలిస్తే 60,990డాలర్ల నుంచి ప్రారంభమై 99,990 డాలర్ల వరకూ ఉంటుంది. మన కరెన్సీలో చూస్తే వీటి ధరలు రూ. 50.82లక్షల నుంచి ప్రారంభమై రూ. 83.30లక్షల రేంజ్ లో ఉంటుంది.



Updated : 7 Dec 2023 7:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top