Home > అంతర్జాతీయం > భారత్కు టెస్లా.. మోడీతో భేటీ తర్వాత మస్క్ ప్రకటన

భారత్కు టెస్లా.. మోడీతో భేటీ తర్వాత మస్క్ ప్రకటన

భారత్కు టెస్లా.. మోడీతో భేటీ తర్వాత మస్క్ ప్రకటన
X

టెస్లా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో సంచలనాలు సృష్టించిన సంస్థ. ప్రస్తుతం ఈ కంపెనీ త్వరలోనే భారత్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీతో మస్క్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ తర్వాత టెస్లా కంపెనీ త్వరలోనే భారత్లో కార్యకలాపాలు మొదలుపెడుతుందని మస్క్ చెప్పారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే యోచనలో ఉన్నట్లు మస్క్‌ తెలిపారు.

‘‘ సాధ్యమైనంత త్వరలో భారత్‌లో టెస్లా ఎంట్రీ ఉంటుందని బలంగా నమ్ముతున్నా. ఈ విషయంలో ప్రధాని మోడీ నుంచి మంచి సహకారం లభిస్తోంది. అందుకు ఆయనకు ధన్యవాదాలు. త్వరలోనే దీనిపై ఓ సానుకూల ప్రకటన ఉంటుంది. ఈ ఒక్క ప్రకటనలో తాము దీన్ని తేల్చేయాలనుకోవడం లేదు. భారత్‌తో సంబంధాల విషయంలో తమ నిర్ణయం కీలకంగా మారనుంది’’ అని మస్క్ అన్నారు.

ఈ సందర్భంగా మోడీపై మస్క్ ప్రశంసలు కురిపించారు. భారత్‌పై మోడీకి చాలా శ్రద్ధ ఉందని.. దేశంలో పెట్టుబడుల పెట్టాలని ఆయన ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తాను మోడీకి అభిమాని అని చెప్పారు. సౌర ఇంధనంలో పెట్టుబడులకూ భారత్లో గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా మస్క్ తో భేటీ అద్బుతంగా జరిగిందని మోడీ అన్నారు. ఇంధనం నుంచి ఆధ్యాత్మికత వరకు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. దీనికి మస్క్‌ స్పందిస్తూ.. ‘‘మీతో మళ్లీ సమావేశం కావడం గౌరవంగా భావిస్తున్నా’’ అని అన్నారు.


Updated : 21 Jun 2023 12:42 PM IST
Tags:    
Next Story
Share it
Top