టెక్సాస్లో రాజుకుంటున్న కార్చిచ్చు..రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
X
అమెరికాలోని టెక్సాస్ పాన్‌హ్యాండిల్ వద్ద కార్చిచ్చులు వేగంగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చు వేగంగా వ్యాపించడంతో..ది స్మోక్ హౌస్ క్రీక్ కారణంగా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లు, పొలాలు, గృహాలు మంటల్లో కాలిపోయాయి. అయితే 1980 నుంచి ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద కార్చిచ్చు అని తెలిపారు. ప్రస్తుతానికి అక్కడి పొడి వాతావరణం ఉండడంతో ఇది ఆగే పరిస్థితి కనిపించడం లేదు. అంతేగాక ఈ కార్చిచ్చు మంటలు శాటిలైట్ ఫొటోల్లో కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. నిన్నటికి ఓక్లహామాలో కూడా మరో 31,500 ఎకరాలను కార్చిచ్చు అంటుకుంది. దీంతో అక్కడ కూడా ఎమర్జెన్సీని విధించారు.
టెక్సాస్ చుట్టుపక్కల వ్యాపించిన మొత్తం కార్చిచ్చులు కలిపి 2,000 చదరపు కిలోమీటర్ల మేర కాలిబూడిద చేశాయి. అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం విస్తీర్ణానికి ఇది సమానం. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. మంటలు చెలరేగిన ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు ప్రకటించింది. దాదాపు 115 కిలోమీటర్లలో ఉన్న కరెంట్ తీగలను మళ్లీ పునరుద్ధరించాలని తెలిపింది. కార్చిచ్చులో వేల సంఖ్యలో పశువులు చనిపోయాయి.