Home > అంతర్జాతీయం > NIO EV Battery : సింగిల్ ఛార్జ్‌తో 1000 కి.మీ మైలేజ్.. ఆ బ్యాటరీ ధరెంతో తెలుసా?

NIO EV Battery : సింగిల్ ఛార్జ్‌తో 1000 కి.మీ మైలేజ్.. ఆ బ్యాటరీ ధరెంతో తెలుసా?

NIO EV Battery : సింగిల్ ఛార్జ్‌తో 1000 కి.మీ మైలేజ్.. ఆ బ్యాటరీ ధరెంతో తెలుసా?
X

ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఉత్పత్తులపై తయారి సంస్థలు దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ 'నియో' (Nio) సింగిల్ ఛార్జ్‌తో 1000 కిమీ ప్రయాణించడానికి అనువుగా ఓ బ్యాటరీని రూపొందించి ఆటోమొబైల్​ ఇండస్ట్రీలో మరో సంచలనం సృష్టించింది. ఆ బ్యాటరీలు విశేషాలెేంటో చూద్దాం..

పెట్రోల్​, డీజిల్​ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ దేశాలు ఈవీ వాహనాలపై దృష్టి పెడుతున్నాయి. అలాగే వినియోగదారులు కూడా ఈవీలకు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆటోమొబైల్​ సంస్థలు పోటాపోటీగా న్యూ ఈవీ మోడల్స్‌ను లాంచ్​ చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు.. ఛార్జ్ విడిదిని తగ్గించి ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా ఉండే బ్యాటరీలను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా చైనా కంపెనీ 'నియో' (Nio) 1000 కిమీ ప్రయాణ సామర్ధ్యంతో కూడిన బ్యాటరీని తయారు చేసి నియో ఈటీ7 ఎలక్ట్రిక్ కారుకు అనుసంధానించింది. 2023 డిసెంబర్ 17న షాంఘైలో ఈ కారు టెస్ట్ జర్నీని లైవ్ స్ట్రీమ్ చెసి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ బ్యాటరీల ప్రొడక్షన్ ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే.. ఈ బ్యాటరీ తయారి విధానం భారీ ఖర్చు కూడిన వ్యవహారం. ఒక్క బ్యాటరీ విలువ సుమారుగా 42,100 డాలర్లు అంటే రూ.32 లక్షలు ఉంటుందని సంస్థ తెలిపింది. ఇక బ్యాటరీ టెస్లా వై మోడల్ లోని కారు బ్యాటరీకి సమాన సామర్ధ్యం ఉంటుంది.

Updated : 3 Jan 2024 11:21 AM IST
Tags:    
Next Story
Share it
Top