Home > అంతర్జాతీయం > Elon Musk : మళ్లీ తొలిస్థానంలోకి ఫ్రెంచ్ లగ్జరీ కింగ్.. రెండో స్థానానికి ఎలోన్ మస్క్

Elon Musk : మళ్లీ తొలిస్థానంలోకి ఫ్రెంచ్ లగ్జరీ కింగ్.. రెండో స్థానానికి ఎలోన్ మస్క్

Elon Musk  : మళ్లీ తొలిస్థానంలోకి ఫ్రెంచ్ లగ్జరీ కింగ్.. రెండో స్థానానికి ఎలోన్ మస్క్
X

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ఎలోన్ మస్క్ ఓ మెట్టు దిగాడు. మళ్లీ తొలిస్థానంలోకి ప్రముఖ లగ్జరీ దిగ్గజం, ఎల్వీఎంహెచ్ సీఈవో, ఫ్రెంచ్ వ్యాపారవేత్త అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానానిక చేరారు. వరల్డ్‌లోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఎలోన్ మస్క్‌ ఉన్నారు. ఇప్పుడు ఆ టెస్లా అధినేతను బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించారు.

టెస్లా అధినేత ఎలోన్ మస్క్ రూ.16 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 207.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇకపోతే మస్క్ 204.5 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. దీంతో 23.6 బిలియన్ డాలర్ల పెరుగుదలతో బెెర్నార్డ్ ఆర్నాల్ట్ మస్క్‌ను అధిగమించి తొలి స్థానంలోకి చేరారు. టెస్లా నికర విలువ 18 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించడంతో మస్క్ తన స్థానాన్ని కోల్పోయారు.

ఇకపోతే 74 ఏళ్ల వ్యక్తి, ఎల్వీఎంహెచ్ సీఈఓగా ఆర్నాల్ట్ నాలుగు దశాబ్దాలుగా విలాసవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యుయర్, డోమ్ పెరిగ్నాన్ వంటి దిగ్గజ బ్రాండ్‌లను కొనుగోలు చేసి తన ఐదుగురు పిల్లలను అందులో భాగస్వామ్యం చేశారు. గతంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న కాలంలో కూడా ఆర్నాల్ట్ తన కంపెనీని లాభాల్లో నడిపారు. 2022 డిసెంబర్ నెలలో కుబేరుల జాబితాలో ఆర్నాల్ట్ తొలి స్థానంలోకి చేరారు. గత ఏప్రిల్‌లో ఎల్వీఎంహెచ్ కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్‌లో 500 బిలియన్ డాలర్లు దాటిన మొదటి యూరోపియన్ కంపెనీగా రికార్డు నెలకొల్పింది.


Updated : 29 Jan 2024 7:42 AM IST
Tags:    
Next Story
Share it
Top