Home > అంతర్జాతీయం > పొంచి ఉన్న కోవిడ్‌ ముప్పు.. మరోసారి కేసులు పెరిగే అవకాశం!

పొంచి ఉన్న కోవిడ్‌ ముప్పు.. మరోసారి కేసులు పెరిగే అవకాశం!

పొంచి ఉన్న కోవిడ్‌ ముప్పు.. మరోసారి కేసులు పెరిగే అవకాశం!
X

కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం కేసు సంఖ్య బాగానే తగ్గాయి. అయితే మరోసారి కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల నుంచి కొత్తగా వైరస్‌లు పుట్టుకొస్తున్నాయని, ఆ వైరస్‌ల కారణంగా ఇన్ఫెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వేసవిలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సి) వెల్లడించింది. గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారంగా దేశంలో పాజిటివ్ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. వేసవిలో జన సంచారం, వాతావరణంలో మార్పుల వల్ల కోవిడ్ ప్రమాదం మరింత పెరగొచ్చని అంచనా వేసింది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్త చెన్ కావో కీలక విషయాలను తెలిపారు. ఒమిక్రాన్ జేఎన్1 వేరియంట్ వల్ల చాలా దేశాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

చైనా, అమెరికా, సింగపూర్ సహా చాలా దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు ఒమిక్రాన్ జేఎన్1 వేరియంటే ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. త్వరలో జేఎన్1 వేరియంట్ తరహాలోనే అధికంగా కేసులు వ్యాపించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందరూ తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Updated : 6 Feb 2024 2:16 PM GMT
Tags:    
Next Story
Share it
Top