Home > అంతర్జాతీయం > ఫిజిక్స్లో ముగ్గురిని వరించిన నోబెల్ ప్రైజ్

ఫిజిక్స్లో ముగ్గురిని వరించిన నోబెల్ ప్రైజ్

ఫిజిక్స్లో ముగ్గురిని వరించిన నోబెల్ ప్రైజ్
X

ఫిజిక్స్లో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ముగ్గురిని వరించింది. ది రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఈ మేరకు ప్రకటన చేసింది. భౌతిక శాస్త్రంలో పియ‌రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్‌, అన్నీ హుయిల్ల‌ర్‌ల‌కు ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వనున్నట్లు చెప్పింది. అణువుల్లో ఎలక్ట్రాన్‌ డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకు.. కాంతి తరంగాల ఆటోసెకండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకుగానూ వీరికి ఈ పురస్కారం అందజేయనున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం చేసేందుకు తోడ్పడుతుందని చెప్పింది.

ఏడాది నోబెల్‌ పురస్కారాల ప్రకటనలో భాగంగా సోమవారం వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ ప్రకటించారు. కొవిడ్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధి చేసిన సైంటిస్టులు కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లకు ఈ అవార్డు దక్కింది. బుధవారం కెమిస్ట్రీ, గురువారం లిటరేచర్ విభాగాల్లో నోబెల్ పురస్కారాల గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం 2023 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 9న ఎకనామిక్స్లో పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ ఏడాది డిసెంబరు 10న వారికి నోబెల్ ప్రైజ్ అందజేస్తారు.

Updated : 3 Oct 2023 10:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top