Home > అంతర్జాతీయం > పాములు పెంచుతూ కోట్లు సంపాదిస్తున్నారు..ఎక్కడో తెలుసా?

పాములు పెంచుతూ కోట్లు సంపాదిస్తున్నారు..ఎక్కడో తెలుసా?

పాములు పెంచుతూ కోట్లు సంపాదిస్తున్నారు..ఎక్కడో తెలుసా?
X

ఈ రోజుల్లో మనిషి సంతోషంగా బతకాలంటే డబ్బు కావాలి. అందుకోసం చాలా మంది ఉద్యోగాలు చేస్తుంటారు. బాస్ పెట్టే టార్గెట్లను తన నైపుణ్యంతో రీచ్ అవుతూ ప్రమోషన్లను పొందుతుంటారు. ఏ ఉద్యోగి అయినా సరే బాస్ అనుగ్రహం ఉంటేనే జీవితంలో పైకి రాగలుగుతాడు. లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెతలా ఉసూరుమంటూ జీవితాన్ని లాగించేయాల్సింది. కానీ ఆ గ్రామంలోని రైతులు మాత్రం ఒకరికింద పనిచేయకుండా పది మందికి ఉపాధి కల్పించే విధంగా స్వయంగా వ్యాపారం చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అయితే రైతులు అనగానే పండ్లు, కూరగాయలు పండిస్తున్నారేమో అని అనుకునేరు. కనే కాదు. ఈ రైతులు వెరీ స్పెషల్ ఎందుకుంటే వీరు పాముల పెపకం ద్వారా ఫేమస్ అయ్యారు. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.

మనదేశంలో చాలా మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉపాధి పొంతుదుంటారు. తమకున్న పొలంలో వరి, పండ్లు, కూరగాయలు వంటివి విరివిగా పండిస్తుంటారు. మరికొందరు కోళ్లు, గొర్రెలు వంటివి పెంచుతూ ఆదాయం పొందుతారు. అయితే చైనాలో మాత్రం ఓ గ్రామంలోని వారంతా పాములను పెంచి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. జిసికియావో గ్రామం పాముల పెంపకానికి ఫేమస్ అయ్యింది. ఇక్కడున్నవారికి పాముల పెంపకమే జీవనాధారం. ప్రతి సంవత్సరం వీటి పెంపకం ద్వారా కోట్లు ఆర్జిస్తున్నారు ఈ గ్రామస్తులు. దీంతో జిసికియావో గ్రామం పేరుకాస్త స్నేక్ విలేజ్‌గా మారిపోయింది. ఈ గ్రామానికి చెందిన ప్రతి వ్యక్తి సుమారు 30వేలకంటే ఎక్కువే పాములను పెంచుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. వీరి పిల్లలు కూడా బొమ్మలతో కాకుండా పాములతోనే ఆడుకుంటారట.

ఇదేదో బిజినెస్ బాగుంది కదా అని అనుకుంటున్నారా. సంపాద చూస్తూ అలాగే ఉంటుంది. కానీ వారంత విషసర్పాలతో సహజీవనం చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఆపద ఎలా ముంచుకువస్తుందో ఎవరికీ తెలియదు. అయినా నిత్యం వాటితోనే ఉంటారు. పాముల మాంసంతో పాటు వాటి శరీర భాగాలను అమ్ముతూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు. అంతే కాదండోయ్ పాము విషయం కూడా ఇక్కడ లభిస్తుంది. ఓ లీటరు విషం ఖరీదు ఏకంగా రూ.3.5 కోట్ల వరకు ఉంటుంది.





Updated : 13 Aug 2023 3:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top