Home > అంతర్జాతీయం > భూమి మీద నూకలున్నాయి..సెకెన్లలో చావు తప్పించుకున్నారు..వీడియో వైరల్

భూమి మీద నూకలున్నాయి..సెకెన్లలో చావు తప్పించుకున్నారు..వీడియో వైరల్

భూమి మీద నూకలున్నాయి..సెకెన్లలో చావు తప్పించుకున్నారు..వీడియో వైరల్
X

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మనం దానిని నుంచి తప్పించుకోలేం. ఊహించని సంఘటనల ద్వారా సెకెన్లలలో ప్రాణాలు పోవచ్చు. అదే భూమి నూకలుంటే మాత్రం ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా బయటపడతాం అనడానికి ఇప్పడు చెప్పబోయే ఘటనే సాక్ష్యం.

ఆనందం, రిలీఫ్ కోసం పర్యటాక ప్రదేశాలకు వెళ్లే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రదేశాలను చూసే ఆనందంలో కానీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ సమయంలో కానీ ఏమరపాటుగా ఉంటే విహారయాత్ర విషాదంగా మారే అవకాశం ఉంటుంది. తాజాగా పర్యాటకుల బృందం పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకునే వీడియో వైరల్ అవుతోంది.

బీచ్ ఒడ్డును ముగ్గురు ప్రయాణికులు నడుస్తున్నారు. ఆ సమయంలో వెనుకకు చూసుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న ఎత్తయిన కొండ నుంచి కొండ చరియలో విరిగిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా వారు వెనక్కు పరుగులు తీశారు. వారు అక్కడి నుంచి వచ్చేసిన సెక్లలోనే కొండ నుంచి ఓ భాగం పూర్తిగా విరిగిపడింది. దీంతో కొద్ది సెకెన్లలో పెను ప్రమాదం నుంచి వారు తప్పించుకున్నారు. ఈఘటన యూకేలోని డోర్సెట్ వెస్ట్ తీరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




Updated : 12 Aug 2023 6:43 PM IST
Tags:    
Next Story
Share it
Top